మమ్మీ, డాడీ కల్చర్‌కు స్వస్తి పలకండి
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
ప్రత్తిపాడు: తెలుగు రాష్ట్రంలో పుట్టిన బిడ్డలెవ్వరూ అమ్మా, నాన్నలను మమ్మీ, డాడీ అని పిలవకూడదని, మమ్మీ, డాడీ కల్చర్‌కు స్వస్తి పలికి, ఇంట్లో తెలుగు మాట్లాడాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ముందస్తు సంక్రాంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరయ్యారు. తొలుత కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన మాజీ రాష్ట్రపతి ఏపీజె అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం హాస్టల్ ఆవరణలో నూతనంగా నిర్మించిన గాయత్రి సదన్ హాస్టల్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. విద్యార్థినుల సాంస్కృతిక నృత్య ప్రదర్శలు, కోలాటాలను ఆసక్తిగా వీక్షించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అమ్మా.. అనే మాట అంతరాల నుంచి వస్తుందని, మమ్మీ అంటే మూతి నుంచి వస్తుందన్నారు. ఇంగ్లీషు తప్పనిసరిగా చదువుకోవాలని, కానీ ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మఒడి నుంచి వచ్చిన భాషను మరిచిపోకూడదన్నారు. విద్యార్థులు పెద్ద
సంఖ్యలో హాజరయ్యారు.


