ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం పోస్టులు ఎస్జీటీలతో భర్తీ చేయాల
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం పోస్టులను ఎస్జీటీలకు ప్రమోషన్లు కల్పించడం ద్వారా భర్తీ చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్ రావు, ఎం.కళాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 219 మంది జూనియర్ స్కూల్ అసిస్టెంట్ టీచర్లను నిర్భందంగా బదిలీ చేయడాన్ని ఆపాలని కోరుతూ జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుకను ఆదివారం నగరంపాలెంలోని స్టాల్ గర్‌ల్స్ హైస్కూల్లో కలిసిన యూటీఎఫ్ జిల్లా ప్రతినిధులు ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం పోస్ట్‌లలో స్కూల్ అసిస్టెంట్లకు మ్యాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు. విద్యాశాఖ అధికారులు హడావుడి నిర్ణయాలు మానుకోవాలని తెలిపారు. డీఈఓను కలిసిన వారిలో జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, ఎండీ షకీలా బేగం, కె.రంగారావు, బెల్లంకొండ ప్రసాదు, ఎం.కోటిరెడ్డి, సీనియర్ నాయకులు పి.హనుమంతరావు, చెన్నకేశవరావు, గఫ్ఫార్, వినోద్ తదితరులు పాల్గొన్నారు


