స్టాంప్‌ వెండార్లపై కత్తి | - | Sakshi
Sakshi News home page

స్టాంప్‌ వెండార్లపై కత్తి

Apr 10 2025 12:39 AM | Updated on Apr 10 2025 12:39 AM

స్టాం

స్టాంప్‌ వెండార్లపై కత్తి

గుంటూరు వెస్ట్‌: ఉపాధి మార్గాలు సృష్టించడం సంగతి దేవుడెరుగు ఉన్న కాస్త జీవనోపాధిని హరించే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం. దాదాపు 150 ఏళ్ల నుంచి నడుస్తున్న నాన్‌ జుడీషియల్‌ స్టాంపుల విక్రయాలు మందగించాయి. ప్రభుత్వ కొత్త విధానాలతో అమ్మబోతే అడివి కొనబోతే కొరివిలాగా ఉంది జిల్లాలోని స్టాంపు వెండార్ల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం స్టాంపుల విక్రయాలకు తెచ్చిన నూతన విధానం అటు స్టాంపు వెండార్లతోపాటు ప్రజలకు కూడా కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. గతంలో స్టాంపు కావాలంటే నేరుగా వెండార్‌ వద్దకు వెళ్ళి, లేదా ఎవరినైనా పంపి స్టాంపులు కొనుగోలు చేసుకోవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎవరికై తే స్టాంపు కావాలో వారే వెళ్లాలి. వారి ఆధార్‌ కార్డు ఇవ్వాలి. వారి ఫోన్‌ నెంబర్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలి. అప్పుడు దానిని కంప్యూటర్‌లో నమోదు చేసి స్టాంపు ప్రింట్‌ తీసి ఇస్తారు. ఈ ప్రక్రియ జరగాలంటే అరగంట పడుతుంది. ఇక్కడ మరో విషయమేమిటంటే ఆన్‌లైన్‌లో ఆధార్‌ ఓపెన్‌ కాకపోతే స్టాంపు లభించదు. ఇలా అయితే ఒక్క స్టాంపు వెండార్‌ రోజుకు ఎన్ని స్టాంపులు విక్రయించగలరు.

ఓటీపీతోనే అసలు తంటా

రూ. 10 నుంచి రూ.100 వరకు ఉండే నాన్‌ జుడీషియల్‌ స్టాంపులు కొనాలంటే వెండార్‌కు ఆధార్‌ కార్డు ఇవ్వాలి. అందులో ఉన్న పేరు, చిరునామాకు మాత్రమే స్టాంపు లభిస్తుంది. అడ్రస్‌ మారినా స్టాంపు ఇవ్వడం కుదరదు. ప్రతి స్టాంపు వెండార్‌ స్టాంపులు విక్రయించేందుకు ఒక దుకాణంతోపాటు కంప్యూటర్‌, ప్రింటర్‌, డిస్‌ప్లే ఏర్పాటు చేసుకోవాలి. ఈ వృత్తిలో చాలా మంది వయోధికులు ఉన్నారు. వారికి ఇంత సెటప్‌ ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదు. కంప్యూటర్‌ పరిజ్జానం లేదు. పైగా స్టాంపుల సరఫరా అరకొరగానే ఉంటుంది. వచ్చే కమీషన్‌ దుకాణం అద్దెకూ సరిపోదు. రోజూ సంపాదించే మూడు, నాలుగొందలతోనే జీవించే వెండార్లే చాలామంది. వీరంతా ఇప్పుడు వృత్తికి దూరం కావాల్సిందే. నెల రోజుల నుంచి కనీసం తీసుకున్న స్టాకులో 5 శాతం కూడా స్టాంపు వెండార్లు విక్రయించలేదు. కారణం ఇంత తతంగం భరించలేక.

ఐజీ కార్యాలయం ఏకపక్ష నిర్ణయం

ఈ కొత్త విధానం రూపకల్పనలో రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖాధికారుల పాత్రే కీలకం. ఈ విధానాన్ని ముందుగా కనీసం జిల్లా రిజిస్ట్రార్లకు, సబ్‌ రిజిస్ట్రార్లకు స్టాంపు వెండార్లకు తెలియజేయకుండానే అమలు చేస్తున్నారు. వెండార్‌ స్టాంపులు విక్రయించాలన్నా ముందుగా కంప్యూటర్‌లో లాగిన్‌ అవ్వాలి. దీనికి ఓటీపీ నమోదుకు పావుగంట పడుతుంది. ఈలోపు ఓటీపీ రాకపోతే మళ్లీ ప్రక్రియ మొదటికే వస్తుంది. దీంతో వెండార్లు ఇబ్బందులు పడుతున్నారు.

సమస్యలు పరిష్కరించండి

పాత తేదీల్లో స్టాంపులు విక్రయించకుండా ఉండేందుకు ఈ విధానం తెచ్చామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే పాత తేదీల్లో స్టాంపులు కొనుగోలు దాదాపుగా ఆగిపోయింది. పాత తేదీల్లో అగ్రిమెంట్లు రాసుకున్నా అవి పనికిరావు. ప్రస్తుత మార్కెట్‌ వాల్యూ ప్రకారమే ఫీజులు చెల్లించాలి. తమను సాగనంపేందుకే ఈ నూతన విధానం అమలు చేస్తున్నారని వెండార్లు ఆవేదన చెందుతున్నారు. కొత్త ప్రక్రియలో లోపాలు సవరించాలని కోరుతున్నారు.

నాన్‌ జుడీషియల్‌ స్టాంప్స్‌

విక్రయాల్లో ఇబ్బందులు

నూతన విధానంతో

మందగించిన అమ్మకాలు

దుకాణం, కంప్యూటర్‌ సిస్టమ్స్‌

ఉండాల్సిందేనంటూ హకుం

ఆధార్‌ ఇచ్చి, ఓటీపీ చెబితేనే

స్టాంప్‌ పేపర్‌

మనుగడ కష్టమేనంటున్న

స్టాంప్‌ వెండార్లు

స్టాంప్‌ వెండార్లపై కత్తి 1
1/2

స్టాంప్‌ వెండార్లపై కత్తి

స్టాంప్‌ వెండార్లపై కత్తి 2
2/2

స్టాంప్‌ వెండార్లపై కత్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement