గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని కళాశాలల్లో బీఎస్సీ(హ్యాన్స్) అగ్రికల్చర్ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం స్పెషల్ కేటగిరి విద్యార్థులకు ఏపీ అగ్రిసెట్– 2023 ర్యాంకుల ఆధారంగా డిప్లొమో హోల్డర్స్‌కు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20వ తేదీన ఏపీజీసీ సెమినార్ హాలు లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం గుంటూరులో ఈ మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించటం జరుగుతుందన్నారు. స్పెషల్ కేటగిరి పీహెచ్, ఎన్‌సీసీ, సీఏపీ, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకున్న ప్రయారిటీలో ఉన్న విద్యార్థులకు సీట్లను భర్తీ చేయటం జరుగుతుందని చెప్పారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
ట్రావెల్స్ కారు చోరీ
నాదెండ్ల: జాతీయ రహదారిపై గణపవరం సీఆర్ కళాశాల సమీపంలోని ఆర్‌ఆర్ కార్ ట్రావెల్స్‌కు చెందిన కారు చోరీకి గురైంది. ఈ మేరకు ట్రావెల్ నిర్వాహకుడు వజ్జా బ్రహ్మయ్య శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో కార్యాలయం మూసి వెళ్లాడు. శుక్రవారం ఉదయం కారు ట్రావెల్స్ రాగా, కార్యాలయం తాళాలు పగలగొట్టి అందులో ఉన్న కారు తాళాలు తీసుకుని కారుతో ఉడాయించినట్లు గుర్తించాడు. సీసీ కెమెరాలకు సంబంధించిన టీవీ, రికార్డర్‌తో పాటూ మరో కలర్ టీవీ, సెల్‌ఫోన్ చార్జర్లు, రెంచీల కిట్‌ను కారులో పెట్టుకుని వెళ్లినట్లు గుర్తించారు. రాత్రి 12 గంటల సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారని బయట ఉన్న లైట్లు ఆపివేసి చోరీకి పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. కారు విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందన్నారు. చోరీకి గురైన సమయంలో అదే ఆవరణలో మరో మూడు కార్లు ఉన్నాయని, వాటి తాళాలు కూడా చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఈ ట్రావెల్స్ ఎదురుగా ఉన్న మరో ట్రావెల్స్‌లో కూడా కారు చోరీకి గురి కాగా, కారుపైనున్న స్టిక్కర్ సాయంతో ఒంగోలులో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment