
సోమవారం శ్రీ 23 శ్రీ అక్టోబర్ శ్రీ 2023
ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలను ఇచ్చే శ్రీదుర్గాదేవి దర్శనంతో భక్తులు తరించారు. శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. సర్వశక్తిమయి, దివ్యరూపిణి అయిన దుర్గమ్మకు అవని జనులు జేజేలు పలికారు. సాయంసంధ్యా సమయాన ఆలయ ప్రాంగణంలో కళాకారులు అమ్మకు నృత్యాభిషేకం చేశారు. భక్తులు క్యూలైన్లలో ఇబ్బంది పడకుండా పోలీసులు, అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అమ్మకు నృత్య నీరాజనం
తెనాలి: దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా బోసురోడ్డులోని వాసవీ కన్యకాపరమేశ్వరి గుడిలో నృత్య గురువు చల్లా బాల త్రిపురసుందరి శిష్యబృందం నృత్యనీరాజనం సమర్పించారు.
మల్లేశ్వరుని సేవలో ఎంపీ అయోధ్య
పెదకాకాని: భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామిని ఆదివారం రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి దర్శించుకున్నారు. స్వామికి అభిషేకం, అమ్మకు కుంకుమ పూజలు చేశారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 525.40 అడుగుల వద్ద ఉంది. ఎస్‌ఎల్‌బీసీకి 1,350 క్యూసెక్కులు విడుదలవుతోంది.
I
న్యూస్‌రీల్





