గుండెనొప్పితో పాఠశాల బస్సు డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెనొప్పితో పాఠశాల బస్సు డ్రైవర్‌ మృతి

Sep 21 2023 1:50 AM | Updated on Sep 21 2023 12:50 PM

- - Sakshi

అద్దంకి: గుండెనొప్పితో తాను చనిపోతానని తెలుసుకున్న డ్రైవర్‌ నడుపుతున్న బస్సును పక్కకు తీసి ఆపి ప్రాణాలు విడిచిన ఘటన బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని మైలవరం గ్రామ సమీపంలో బుధవారం జరిగింది. అందిన సమాచారం మేరకు అద్దంకి మండలంలోని చక్రాయపాలెం గ్రామానికి చెందిన గుర్రాల ఏడుకొండలు (55) 13 ఏళ్ల నుంచి పట్టణంలోని చైతన్య పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో బుధవారం ఉప్పలపాడు–మైలవరం రూట్‌లోని పిల్లలను ఎక్కించుకు రావడానికి వెళ్లాడు. పిల్లలను ఎక్కించుకుని వస్తూ అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో బస్సులో ఉన్న పిల్లల ప్రాణాలను రక్షించేందుకు నడుపుతున్న బస్సును పక్కకు తీసి ఆపి తాను ప్రాణాలు విడిచాడు. ఏడుకొండలుకు భార్య, కుమారుడు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement