యోగ సాధకుల్లో అద్వితీయులం | Yoga Day Special: World Yoga Day on June 21 2026 | Sakshi
Sakshi News home page

యోగ సాధకుల్లో అద్వితీయులం

Jun 21 2026 3:01 AM | Updated on Jun 21 2026 3:01 AM

Yoga Day Special: World Yoga Day on June 21 2026

యోగశాస్త్రానికి మన దేశం పుట్టినిల్లు. దాదాపు ఐదువేల ఏళ్ల కిందట యోగా మన దేశంలోనే మొదలైంది. కాలక్రమంలో ఇక్కడి నుంచి ప్రపంచం నలుమూలలకూ విస్తరించింది. మన పురాణాలు పరమశివుడిని ఆదియోగిగా అభివర్ణిస్తాయి. యోగశాస్త్రానికి పతంజలి మహర్షి తొలి గురువు. యోగశాస్త్రంలో అష్టాంగ మార్గాన్ని బోధించిన పతంజలి మహర్షి, 196 సూత్రాలను గ్రంథస్థం చేశాడు. ఇప్పటికీ యోగ సాధకులకు పతంజలి సూత్రాలే మార్గదర్శకాలు. ఆధునిక ప్రపంచంలో యోగా పురోగతిపై గణాంకాల్లో సమాచారం...

భారత్‌ సహా దాదాపు అరడజను దేశాలలోని యూనివర్సిటీలు యోగాలో వివిధ స్థాయులకు చెందిన కోర్సులు నిర్వహిస్తున్నాయి. భారత్, అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడాలలోని కొన్ని యూనివర్సిటీలు యోగాలో ప్రత్యేక కోర్సులు, పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. వివిధ దేశాలలో యోగా శిక్షణ కేంద్రాలను ప్రైవేటు నిర్వాహకులే నడిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా శిక్షణ కేంద్రాలలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. మన దేశం రెండో స్థానానికి పరిమితమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement