Why Saturday Is Special To Lord Venkateswara Swamy, Know Facts Inside - Sakshi
Sakshi News home page

Why Saturday Special To Lord Balaji: వెంకటేశ్వర స్వామికి శనివారం ఎందుకంత ప్రీతి ?.. ఆ రోజే ఆయన్ను పూజించాలా?

Jul 29 2023 10:36 AM | Updated on Jul 31 2023 2:56 PM

Why Saturday Is Special To Lord Venkateswara Swamy - Sakshi

ఏయే వారాల్లో ఏ దేవుడుని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుదనే వాటి గురించి పండితులు శాస్త్రాల్లో విపులంగా వివరించారు. అందులో భాగంగానే ఆదివారం సూర్యభగవానుడికి, సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామి, సుబ్రమణ్యేశ్వర స్వామికి, బుధవారం గణపతి, అయ్యప్ప స్వామి, గురువారం సాయిబాబా, దత్తాత్రేయుడు, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి అని ఇలా.. ఒక్కో రోజు ఒక్కోస్వామికి ప్రత్యేకం కేటాయించి మరి చెప్పారు. అయితే వెంకటేశ్వర స్వామికి మాత్రం శనివారం అంటేనే ఎందకంత ప్రత్యేకం అంటే..

శనివారమే శ్రీవారిని పూజించటానికి గల కారణం..

  • ఓంకారం ప్రభవించిన రోజు శనివారం
  • శనివారం శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం
  • వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటి సారి దర్శించిన రోజు శనివారం
  • ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం
  • శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే
  • ఇక వేంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినది కూడా శనివారమే అందుకే ఏడుకొండలవాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం.

వెంకటేశ్వర స్వామికి కూడా శనివారం ప్రత్యేకం కావడంతో ..భక్తులు ఆ రోజు దేవుడికి పూజలు, మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే కలౌ వేంకట నాయకః అన్న నానుడి ప్రకారం..కలియుగంలో అత్యంత శక్తిమంతమైన దైవం శ్రీనివాసుడు. అందువల్ల భక్తులు తమకు ఎదురయ్యే  కష్టాలు, సమస్యల నుంచి గట్టెక్కించి బయటపడేశావాడు ఆయనే అని విశ్వసిస్తారు. ఈ శనివారం రోజు వాడవాడల ఉన్న శ్రీనివాసుని ఆలయాలన్ని కిటకిటలాడుతుంటాయి. మాములు రోజుల కంటే శనివారం ఆయన్ను పూజిస్తే శనిశ్వరుడు పెట్టే బాధల నుంచి విముక్తి లభిస్తుంది. పైగా అనుకున్న పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా శ్రీనివాసుడు తమను అనుగ్రహిస్తాడనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

(చదవండి: గాంధారి వాన ఏమిటి?..అసలు దృతరాష్ట్రుని భార్యకు.. వానకు సంబంధం ఏమిటి)

Advertisement
 
Advertisement
Advertisement