Whale Doing A Rare Headstand In Middle Of The Ocean - Sakshi
Sakshi News home page

Viral Video: నడి సంద్రంలో తిమింగలం ఫోజు చూస్తే..షాకవ్వడం ఖాయం!

Aug 15 2023 4:45 PM | Updated on Aug 21 2023 4:08 PM

Whale Doing A Rare Headstand In Middle Of The Ocean - Sakshi

సముద్రంలో ఉండే వివిధ జంతువుల వీడియోలు చూశాం. నడి సంద్రం వద్దకు వచ్చేటప్పటికీ అక్కడ ఉండే జల చరాలన్నీ చాలా స్పష్టంగా అద్భుతంగా కనిపిస్తాయి. పైగా నీరు కూడా చాలా స్వచ్ఛంగా కనిపించడంతో అన్ని జంతువుల ఆకృతి చాలా క్లియర్‌గా చూడగలం. అలానే ఓ ఆస్ట్రేలియన్‌కి చెందిన ఓ ప్రకృతి ఔత్సాహికుడు తన బోట్‌తో సరదాగా సముద్రంలో చక్కర్లు కొడుతుండగా ఓ ఘటన చూసి కంగుతిన్నాడు.

అందేంటి అని ఆశ్చర్యంగా సమీపం వరకు వెళ్లితే గానీ తెలియలేదు. తీరా చూస్తే తిమింగల తోక.  అది కూడా తలకిందుల పొజిషన్‌లో ఉంది. ఇంతవరకు ఎప్పుడూ చూడని విధంగా తిమింగలాన్ని అలా చూసేటప్పటికీ ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైందని అంటున్నాడు ఆ వ్యక్తి. తోకను తిమింగలం చాలా పైకి లైపి హెడ్‌స్టాండ్‌ పొజిషన్‌లో ఉంచింది. సముద్ర ఉపరితలానికి అతుక్కుని నుంచొని ఉంది. పైగా అది తన పిల్లలతో హాయిగా సేద తీరుతుంది. తిమింగలం విశ్రాంతి తీసుకునేటప్పుడూ ఆ పొజిషన్‌లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకు సంబందించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

(చదవండి: అ‍త్యంత పురాతన 'పబ్‌'..సందర్శకులు మాత్రం దాన్ని..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement