క్లూషియల్..
నగర శివారులో భారీ సెట్. టాలీవుడ్ టాప్ హీరో అవినాష్ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ జరుగుతోంది. షాట్ గ్యాప్‌లో అవినాష్ తన క్యారవా¯Œ లోకి వెళ్లాడు. అవినాష్‌కు అమ్మాయిల పిచ్చి. అందుకే తన ప్రైవసీ కోసం, క్యారవాన్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల కనెక్షన్లను ముందే కట్ చేయించాడు.
కొద్దిసేపటికే బురఖా ధరించిన ఒక అమ్మాయి క్యారవా¯Œ లోకి వెళ్లడం కొందరు గమనించారు. కాని, గంట దాటినా లోపలి నుండి ఎటువంటి శబ్దం లేదు. ప్రొడక్షన్ బాయ్ కాఫీ తీసుకుని వెళ్లి డోర్ కొట్టినా సమాధానం రాలేదు. అనుమానంతో తలుపు నెట్టి చూశాడు. క్యారవాన్‌లో అవినాష్ రక్తం మడుగులో పడి ఉన్నాడు.
సమాచారం అందిన వెంటనే, క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ అభిమన్యు తన టీమ్‌తో స్పాట్‌కు చేరుకున్నాడు. శవాన్ని పరీక్షించిన డాక్టర్ పాయిజన్ ఇంజెక్ట్ చేసిన కారణంగా హీరో అవినాష్ మరణించినట్టు చెప్పాడు.
ఇన్‌స్పెక్టర్ అభిమన్యు క్లూస్ టీమ్‌తో దర్యాప్తు ప్రారంభించాడు. క్యారవాన్ వైపు ఉన్న సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదు. లొకేషన్ వెలుపల ఉన్న కెమెరాలను పరిశీలిస్తే, బురఖా వేసుకున్న అమ్మాయి అటువైపు వచ్చిన విజువల్స్ ఉన్నాయి. ఇంజక్షన్‌ను బలంగా చేసినట్టు నీడిల్ మొన శరీరంలో దిగబడిన తీరును బట్టి తెలుస్తుంది. అది కచ్చితంగా ఒక లెఫ్ట్ హ్యాండర్ చేసిన హత్య అని అభిమన్యు గుర్తించాడు.
క్యారవాన్ నుంచి కిందికి దిగుతుంటే అతని దృష్టి ఒకవైపు పడింది. చుట్టూ చూసి చేతులకు గ్లవుజ్ ధరించి ఆ వస్తువును ఎవిడె¯Œ ్స కవర్‌లో వేసుకున్నాడు.
యూనిట్‌లో ఉన్న ప్రొడ్యూసర్ ను పిలిపించాడు. డైరెక్టర్ వచ్చాడు. హీరోయిన్‌ను విచారించాడు.
సినిమా యూనిట్‌లో ఎడమచేతి వాటం ఉన్నవారి లిస్ట్ తీశాడు. అందులో ఆ సినిమాలో విల¯Œ గా నటిస్తున్న అభిజిత్ పేరు ఉంది. వెంటనే అభిమన్యు కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్‌ను సోదా చేశాడు. అక్కడ ఒక పెట్టెలో దాచిన బురఖా దొరికింది. సినిమాలో విలన్ అభిజిత్ పోషిస్తున్న పాత్ర ఏమిటి? డైరెక్టర్‌ని అడిగాడు ఇన్‌స్పెక్టర్ అభిమన్యు.
‘డాక్టర్ పాత్ర... హీరోని పాయిజన్ ఇంజక్షన్‌తో హత్య చేయాలని ప్రయత్నిస్తాడు...’ డైరెక్టర్ చెప్పాడు.
‘విలన్ అభిజిత్ కాస్టూమ్స్, షాట్‌లో వాడే డిస్పోజబుల్ సిరంజి ఎక్కడ?’ అడిగాడు ఇన్‌స్పెక్టర్ అభిమన్యు.
అసిస్టెంట్ డైరెక్టర్ అన్నీ పట్టుకుని వచ్చాడు. ఒక్క డిస్పోజబుల్ సిరంజ్ తప్ప...
‘ఇదొక్కటి మిస్సయ్యింది సర్...’ అనుమానంగా, భయంగా చెప్పాడు డైరెక్టర్..
అభిమన్యు చిన్నగా నవ్వి, ‘నో ప్రాబ్లెమ్... మీ దగ్గర మిస్సయ్యింది నా దగ్గర ఉంది.’ అంటూ తన కోటు జేబులో ఉన్న ఎవిడె¯Œ ్స కవర్‌లో ఉన్న డిస్పోజబుల్ సిరంజ్ చూపించి, ‘థాంక్యూ... దట్స్ ఇట్’ అని లేచాడు.
ఇంటరాగేషన్ సెల్...
‘వెల్ మిస్టర్ అభిజిత్! సినిమాలో నీ పాత్రకు నువ్వు ప్రాణం పోశావు. సినిమాలో నువ్వు చేసే షాట్ రిహార్సల్ చేశావు. ఆ రిహార్సల్ షాట్‌ను నువ్వే ఓకే చేసి, హీరోను చంపి నువ్వు హీరో అవ్వాలనుకున్నావు కదూ! అసలు ఎందుకు ఈ హత్య చేశావు? ప్రొఫెషనల్ జెలసీనా?’ కావాలనే అడిగాడు ఇన్‌స్పెక్టర్ అభిమన్యు.
‘అతను హీరో, నేను విలన్ ఇందులో ప్రొఫెషనల్ జెలసీ లేదు. పర్సనల్ పగ మాత్రమే వుంది.’ కొనసాగించాడు అభిజిత్. ‘అవినాష్ లాంటి విలన్లు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బతికి ఉండడానికి వీల్లేదు. ప్రేక్షకులలో ఉన్న గ్లామర్‌ను అభిమానాన్ని ఇలా మిస్‌యూజ్ చేస్తూ , అమ్మాయిలతో మిస్ బిహేవ్ చేసే వాళ్లకు బ్రతికే హక్కు లేదు...
నా చెల్లెలు అవినాష్‌కు పెద్ద అభిమాని. అవినాష్‌ను కలవడానికి వచ్చినప్పుడు, నా చెల్లెలిని లొంగదీసుకుని వాడుకుని వదిలేశాడు. ఆ డిప్రెష¯Œ తో ఆమె ఆత్మహత్య చేసుకుంది. నా చెల్లెలి చావుకు కారణమైన అవినాష్‌పై పగ తీర్చుకోవడానికి ఈ ప్లాన్ వేశాను. అవినాష్‌కు ఉన్న అమ్మాయిల బలహీనతను ఆసరాగా చేసుకుని, నేనే బురఖా వేసుకుని అమ్మాయిలా క్యారవా¯Œ లోకి వెళ్లాను. వాడిని చంపడానికి సినిమాలో నా పాత్ర కలిసి వచ్చింది. షూటింగ్‌లో వాడే డిస్పోజబుల్ సిరంజిలో పాయిజన్ నింపాను. ఒకే ఒక్క చిన్న పోటు. సిరంజిలోని విషం నా చెల్లెలి చావుకు ప్రతీకారం తీర్చుకుంది.’
‘ఆ తర్వాత ఆ బురఖా తీసి మామూలుగా బయటకు వచ్చావు. ఎవ్వరి కంట పడకుండా. ఆ బురఖాను కాస్ట్యూమ్ రూమ్‌లో దాచేసి ఏమీ తెలియనట్టు షూటింగ్‌లో పాల్గొన్నావు. ఆ సిరంజిని నిర్లక్ష్యంగా ఓ మూలకు పడేశావు. అదే నిన్ను పట్టించింది. ‘సినిమాలో హీరో అయినా అవినాష్ నిజ జీవితంలో విలన్‌లా ప్రవర్తించాడు. అందుకే నువ్వు హీరోలా సినిమాటిక్ గా పగ తీర్చుకోవాలనుకున్నావు. సినిమాల్లో ఈ ముగింపు బాగుంటుంది. కాని, చట్టం దృష్టిలో మాత్రం నేరమే అవుతుంది. తప్పు చేసిన వారిని శిక్షించాల్సింది చట్టం, నువ్వు కాదు.’ చెప్పాడు ఇన్‌స్పెక్టర్ అభిమన్యు. - శ్రీసుధామయి
క్రైమ్ కథలకు ఆహ్వానం..
ఉత్సాహవంతులైన రచయితల నుంచి క్రైమ్‌కథలను ఆహ్వానిస్తున్నాం. ఉత్కంఠ తగ్గకుండా పాఠకులతో చదివించే సస్పెన్స్ థ్రిల్లర్ కథలను ఈ శీర్షిక కోసం పంపండి. కథల నిడివి 450 పదాలకు మించరాదు. కథతో తప్పనిసరిగా హామీపత్రం ఉండాలి. కథలను తెలుగు యూనికోడ్‌లో టైప్ చేసి ఈ దిగువనున్న ఈ–మెయిల్‌కు పంపాలి. funday.kathalu@gmail.com


