అలనాటి గోల్డెన్‌ డేస్‌: ఆ తాతయ్య కనులలో కోటి పండగల కళ..! | Viral Video: 96 Year Old Man Plays With Great Granddaughter | Sakshi
Sakshi News home page

అలనాటి గోల్డెన్‌ డేస్‌: ఆ తాతయ్య కనులలో కోటి పండగల కళ..!

Apr 4 2025 9:54 AM | Updated on Apr 4 2025 10:43 AM

Viral Video: 96 Year Old Man Plays With Great Granddaughter

తాతగారు తన మనవళ్లు, మనవరాళ్లను దగ్గర కూర్చోబెట్టుకొని సరదాగా ముచ్చటించేవాడు. చందమామ కథలు చెప్పేవాడు. హాయిగా నవ్వించేవాడు.

ఇప్పటి దృశ్యం.....
తాతయ్య ఎప్పుడూ ఒంటరిగానే కనిపిస్తాడు. ఎప్పుడూ ఒకేలా కనిపిస్తాడు. పిల్లలు హోంవర్క్‌ అనే ప్రపంచం నుంచి ఎప్పుడోగానీ బయటికి రారు. బయటికి వచ్చినా తాతయ్యతో  పొడి పొడి మాటలే ఉంటాయి. ఈ నేపథ్యంలో అలనాటి బంగారు కాలాన్ని గుర్తుకు తెచ్చే వీడియో నెటిజనులలో భావోద్వేగాలను రేకెత్తిస్తోంది. 

96 ఏళ్ల తాతయ్య తన ముని మనవరాలితో ఆడుకుంటున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో  పోస్ట్‌ చేశారు. చిన్నారి నవ్యతో బొమ్మలాట ఆడుకుంటున్నప్పుడు తాతయ్య కనులలో కోటి పండగల కళ కనిపించింది. ఈ వీడియో క్లిప్‌ను చూస్తూ చాలామంది తమ బాల్యంలోకి వెళ్లి తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలను గుర్తు తెచ్చుకున్నారు.

 

(చదవండి: రైలు మిస్‌ అయినా పర్లేదు..ఇలాంటి టెన్షన్‌ వద్దు..!)

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement