గణనాథుడికి...ఘనమైన ఆసనం | Vinayaka Chavithi Background Decoration | Sakshi
Sakshi News home page

గణనాథుడికి...ఘనమైన ఆసనం

Sep 13 2026 1:26 AM | Updated on Sep 13 2026 1:33 AM

Vinayaka Chavithi Background Decoration

గణేష్‌ వేడుకలలో ప్రధానంగా కనిపించేది అలంకరణ. గణనాథుడి ప్రతిమతో పాటు ఆసనం, బ్యాక్‌గ్రౌండ్, చుట్టూ రంగురంగుల పువ్వులు, కాంతులీనే లైట్లు... కనువిందు చేస్తుంటాయి. మండపాల వద్ద సరే,  ఇళ్లలోనూ ఈ విధమైన అలంకరణ సందడి కనిపించాలంటే..?

ఎక్కువ హంగామా లేకుండా అలంకరణ ఆకట్టుకునేలా ఉండేలా భిన్నమైన ఆసనాల స్టాండ్స్‌ మార్కెట్లో లభిస్తున్నాయి. ఈవెంట్‌ ప్లానర్స్‌ వీటిని మరింత అందంగా రూపుకట్టి మన ముందుకు తీసుకు వస్తున్నారు. ముత్యాలు, రత్నాలు, జరీ, వెల్వెట్, మిర్రర్‌ వర్క్‌ వంటి వాటితో రూపొందించే ఈ ఆసనాలు చిన్న వినాయక విగ్రహాలకు చక్కగా అమరుతున్నాయి. ముఖ్యంగా తక్కువ స్థలంలో పూజ చేసుకునే వారికి ఇవి ఉపయుక్తం కూడా. 

అందమైన పువ్వులు... ఆర్టిఫిషియల్‌ రోజాలు, మల్లెలు, చామంతులు, పచ్చని ఆకులతో తయారు చేసిన ఆసనం వినాయకుడి చుట్టూ పూల వేదికలా కనిపిస్తుంది. పండుగ తర్వాత ఈ ఆసనం సెట్‌ను స్టోర్‌ చేసుకుంటే ఇతర పూజ లు లేదా ఇంటి అలంకరణ ల్లో ఉపయోగించుకోవచ్చు. ఈ ఆసనాలు కానుక గా ఇవ్వడానికి కూడా బాగుంటాయి.

స్థలానికి తగ్గట్టు ... ఫ్లాట్‌లు, అపార్ట్‌మెంట్‌లలో స్థలం పరిమితంగా ఉంటుంది. అందుకు తగినట్టు అలంకరణ  చేయాలన్నా అందరికీ కుదరదు. అందుకని, చిన్న సైజు ఆసనాలు మార్కెట్లోకి వచ్చాయి. టేబుల్, షెల్ఫ్‌ లేదా చిన్న పూజా స్థలంలో కూడా వీటిని సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు.

సంప్రదాయం.. ఆధునికత... గోల్డ్‌ లేదా కాపర్‌ ఫినిష్‌తో ఉండే ఆర్టిఫిషియల్‌ ఆసనాలు గణేషుడి ప్రతిమకు రాజసాన్ని జోడిస్తాయి. మరోవైపు వుడ్, జూట్, పేస్టెల్‌ పూలతో రూపొందించిన ఆసనాలు మినిమల్‌ హోమ్‌ డెకార్‌ను ఇష్టపడేవారికి నచ్చుతాయి. అయితే ఆసనం ఎంచుకునేటప్పుడు విగ్రహం పరిమాణానికి తగిన సైజు ఉండేలా చూసుకోవాలి. ప్రతిమ ఎంత అందంగా ఉన్నా, దానికి తగిన ఆసనం ఆ అలంకరణకు మరింత ప్రత్యేకతను, ఇంటికి స్పెషల్‌ లుక్‌ తీసుకొస్తుంది.
           
సులభంగా అలంకరణ
కృష్ణాష్టమి, గణేష్‌ చతుర్ధి, వరలక్ష్మి.. వంటి సంప్రదాయ వేడుకలలో ప్రతిమలకు ఈ డెకార్‌ ఆసనాలు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి పూర్తిగా చేతితో తయారు చేసినవి. సులభంగా అమర్చుకోవచ్చు, విడదీసి స్టోర్‌ చేసుకోవచ్చు. పండగ శోభ కోసం తయారు చేసిన ఈ అలంకరణలలో పూసలు, లేసులు, కుందన్స్, మఖమల్‌ క్లాత్‌తో పాటు ఖరీదైన స్టోన్స్‌ కూడా ఉపయోగించి డిజైన్‌ చేస్తున్నాం. 
– లక్ష్మి సింగ్లా, డెకార్‌ క్రియేషన్స్‌ 
                  
– నిర్మలారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement