అమెరికా రియాల్టీ టీవీ స్టార్‌ అనుమానాస్పద మృతి | US Reality TV Star Keke Jabbar Passed away | Sakshi
Sakshi News home page

అమెరికా రియాల్టీ టీవీ స్టార్‌ అనుమానాస్పద మృతి

Jul 5 2024 11:53 AM | Updated on Jul 5 2024 12:37 PM

US Reality TV Star Keke Jabbar Passed away


అమెరికా రియాల్టీ స్టార్‌ కేకే జబ్బార్‌ ( 42) అనుమానాస్పరీతిలో కన్నుమూసింది.  యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్‌లో జబ్బార్ మరణవార్తను కుటుంబం ప్రకటించింది. దీంతో జబ్బార్‌ ఫ్యాన్స్‌  అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా   తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.  

యూఎస్‌లో 'లవ్  అండ్‌  మ్యారేజ్:హంట్స్‌విల్లే' రియాలిటీ టీవీ షోతో పాపులర్‌ అయిన కేకే  తన  కారులోనే శవమై తేలింది.  అనుమానాస్పద స్థితిలో కారులో విగతజీవిగా పడివున్న జబ్బార్‌ను తొలుత ఆమె భర్త గుర్తించారు. దీంతోఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.    డ్రగ్‌ డోస్‌ ఎక్కువకావడం మరణించిందా, లేక ఆత్మహత్యకు పాల్పడింది అనుమానాలు వెల్లువెత్తాయి.

మరోవైపు  జబ్బార్‌ అకాలమరణపై వస్తున్న ఊహాగానాలపై సన్నిహిత మిత్రుడు  యూట్యూబర్ జోఆన్ జెంకిన్స్ క్లారిటీ ఇచ్చారు. కేకే అతిగా మద్యం సేవించలేదనీ, జీవితాన్ని చాలాప్రేమించేదనీ, ఆత్మహత్య చేసుకునే ఉద్దేశం అసలే  లేదని వివరణ ఇచ్చారు.  అయితే జబ్బార్‌ మరణాలకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.

కేకే జబ్బార్  కుటుంబం
కేకే భర్త అమీన్ జబ్బార్‌ ఇంటూటివ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్‌లో సెక్యూరిటీ స్పెషలిస్ట్/ప్రోగ్రామ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమారులు , ఒక కుమార్తె.


 

Advertisement
 
Advertisement
Advertisement