ఉమెన్‌ సేఫ్టీ: ఆపదలో అండగా..! | Student Karan Develops smart device for womens safety in public spaces | Sakshi
Sakshi News home page

womens safety: ఆపదలో అండగా...!ఈ స్మార్ట్‌ డివైజ్‌తో భద్రంగా ఉండొచ్చు..

Jun 3 2025 9:37 AM | Updated on Jun 3 2025 9:37 AM

Student Karan Develops smart device for womens safety in public spaces

బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని మైసూర్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ స్టూడెంట్‌ కరణ్‌ సరికొత్త పరికరాన్ని తయారుచేశాడు. ఐజీడబ్ల్యూఎస్‌(ఇన్నోవేటివ్‌ ఇంటెలిజెంట్‌ జీయోఫెన్స్‌–ఎనేబుల్డ్‌ వేరుబుల్స్‌ సిస్టమ్స్‌) అనే పరికరం మహిళలు ఆపదలో ఉంటే వారి ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ను ఎలార్ట్‌ చేస్తుంది.

‘డివైజ్‌లోని ముఖ్యమైన ఫీచర్‌లలో ఒకటి...జియోఫెన్స్‌–బేస్డ్‌ డిటెక్టర్‌. ఒక మహిళని ఎవరైనా మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు ఫాలో అవుతున్నప్పుడు ఈ డివైజ్‌ సందేహాస్పద వ్యక్తి మొబైల్‌ ఫోన్‌ను గాని, బ్లూటూత్‌ డివైజ్‌ అడ్రస్‌ గుర్తించడానికి ఉపయోగపడుతుంది’ అంటున్నాడు కరణ్‌.

ఈ డివైజ్‌లో జియోఫెన్స్‌–బేస్డ్‌ సేఫ్టీ టైమర్‌ కూడా ఉంటుంది. యూజర్‌ ఒక డెస్టినేషన్‌ చేరుకోవడానికి టైమ్‌ సెట్‌ చేసుకోవచ్చు. ఒక అమ్మాయి షాపింగ్‌కు వెళ్తూ 30 నిమిషాలలో ఇంటికి వస్తానని చెబితే సిస్టమ్‌ ఆమె జియోలోకేషన్‌ని మానిటర్‌ చేస్తుంది. సెట్‌ చేసిన టైమ్‌ లోపు ఇంటి జియోఫెన్స్‌లోకి రాకపోతే డివైజ్‌ ఆటోమెటిక్‌గా ఆమె లోకేషన్‌ని ఎమర్జెనీ కాంటాక్ట్‌కి పంపిస్తుంది. 

డివైజ్‌లో ‘రిటర్న్‌ హోమ్‌ సేఫ్టీ రిమైండర్‌’ కూడా ఉంటుంది. డివైజ్‌లో మరో సేఫ్టీ ఫీచర్‌...డేంజర్‌–జోన్‌ నోటీఫైయర్‌. ఇది హై–రిస్క్‌ జీపీఎస్‌ లొకేషన్స్‌ ప్రీలోడెడ్‌ జాబితాను ఉపయోగిస్తుంది. యూజర్‌ ఈ ప్రాంతాలలోకి వెళ్లినప్పుడు వేరబుల్‌ బజర్‌ యాక్టివేట్‌ అవుతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్‌కి తెలియజేస్తుంది. 

(చదవండి: ఆ మూడు తినదగినవి కావు..కానీ అవే ఆరోగ్యం..! బిగ్‌బీకి కూడా నచ్చవట..)

Advertisement
 
Advertisement
Advertisement