బాహ్య సౌందర్యం.. ఆత్మ సౌందర్యం.. ఏది మిన్న? | The Spiritual Story Written About Outer Beauty And Inner Beauty | Sakshi
Sakshi News home page

బాహ్య సౌందర్యం.. ఆత్మ సౌందర్యం.. ఏది మిన్న?

Jun 25 2026 9:34 AM | Updated on Jun 25 2026 9:34 AM

The Spiritual Story Written About Outer Beauty And Inner Beauty

నిర్మల వాణి

శ్రీ మాతాజీ నిర్మలాదేవి

చాలామంది సౌందర్యానికి ప్రతీక ఏమిటంటే ‘మోనాలిసా‘ అని చె΄్తారు. మోనాలిసా చిత్ర పటాన్ని తయారు చేసిన కళాకారుడు లియోనార్డో డావిన్సీ. అతను ఫ్రాన్స్‌కు చెందిన కళాకారుడు, శాస్త్రవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి.

అతను గీసిన మోనాలిసా చిత్రపటం, నిజానికి ఒక బిడ్డను కోల్పోయిన తల్లిది. ఆమె తన బిడ్డ చనిపోవడం వలన చాలా కాలం΄ాటు దుఃఖంతో బాధ పడుతుంది. ఒకరోజు తన బిడ్డ పోలికలున్న మరొకరి బిడ్డను చూసినప్పుడు, ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు ఉదయిస్తుంది. ఆ సమయంలో ఆమె ముఖంలో వెలిగిన చిరునవ్వును డావిన్సీ యథాతథంగా చిత్రించారు. ఎన్ని తరాలు గడిచినా ఇప్పటికీ, ఆమె ముఖంలో విరిసిన చిరునవ్వు సౌందర్యానికి ప్రతీకగా నిలిచిపోయింది.

నేటి ఆధునిక కాలంలో అందానికి ఉన్న నిర్వచనాల ప్రకారం మోనాలిసా పెద్ద అందగత్తె కాదు. అయినప్పటికీ కొన్ని తరాలుగా, ఆమె చిత్రపటం అందరినీ ఆకర్షిస్తూనే ఉంది. సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూనే ఉంది. దానికి కారణం ఏమిటి? ఆ చిత్రపటం నుండి వచ్చే చైతన్య తరంగాలు, వైబ్రేషన్స్‌, మానవులలో గల అంతరాత్మను స్పృశిస్తాయి. అది ఆత్మసౌందర్యాన్ని ప్రతిబింబించే చిత్రపటం.

ఒక స్త్రీ ముఖంలో మాతృప్రేమ ప్రతిఫలిస్తున్నప్పుడు, ఆమె అత్యంత సుందరంగా కనిపిస్తుంది. మానవుల దృష్టిని అథోముఖంగా తీసుకొని వెళ్ళే భౌతికమైన శరీర ఆకర్షణ అంత ముఖ్యమైనది కాదు. మన శరీర ప్రతిభాగం నుండి చైతన్య తరంగాలు ప్రవహించేలా మనం ఉండాలి. మన శరీరంలో అన్ని భాగాలు శుభప్రదంగా ఉండాలి.

మనం దేనినైనా తాకినట్లయితే, దాని నుండి చైతన్య తరంగాలు ప్రవహించడం ్ర΄ారంభించాలి. అటువంటి శరీర సౌందర్యం దైవికమైన సౌందర్యం. బాహ్య సౌందర్యం వెంట కృత్రిమమైన ఆకర్షణల వెంట పరుగెత్తడం మంచిది కాదు.

మనం శ్రద్ధ వహించవలసిన విషయమేమిటంటే – మన శరీరం మన ప్రతి భాగంలో పవిత్రత ప్రవహించే విధంగా ఉందా? మనల్ని చూస్తే ప్రజలు పవిత్రమైన భావనలు పొందుతున్నారా లేదా అపవిత్రమైన భావనలు పొందుతున్నారా? వేల సంవత్సరాల నుండీ వారసత్వంగా పొందిన సంస్కృతీ సంప్రదాయాలు మన భారతీయుల దగ్గర ఉన్నాయి. ఆ సంప్రదాయాలను నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నించాలి. – డా. ప్రతాని రాకేశ్‌, సహజ యోగసాధకులు (పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి  ప్రవచనాల ఆధారంగా)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement