స్టన్నింగ్‌ బ్యూటీ శోభితా ధూళిపాళ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!

Sobhita Dhulipala Shines In Stunning Rani Pink Saree - Sakshi

స్టన్నింగ్‌ బ్యూటీ.. సూపర్‌ యాక్ట్రెస్‌ శోభితా ధూళిపాళ.. తెలుగు, హిందీ.. సిల్వర్‌ స్క్రీన్, వెబ్‌ స్క్రీన్‌ అనే తేడా లేకుండా దూసుకుపోతోంది. వినూత్నమైన ఆలోచనలతో వైవిధ్యమైన కథలు రాసేవారి కోసం ఓ స్టూడియోను ప్రారంభించింది. ఆమె కథను ఏ భాషలో చెబుతున్నాం, ఏ ఫ్లాట్‌ఫామ్‌ మీద చెబుతున్నాం అనేదాన్ని పెద్దగా పట్టించుకోను. ఫీచర్‌ ఫిల్మ్‌ అయినా వెబ్‌ అయినా హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎఫర్ట్స్‌ పెడతాను. ఫలితం గురించి పెద్దగా పట్టించుకోను. అంటోంది. ఆ వెర్సటాలిటీని ఫ్యాషన్‌లోనూ చూపిస్తోంది. అందుకు ఆమె ఎంచుకున్న బ్రాండ్స్‌లో కొన్ని ఇక్కడ..

తోరానీ
ఈ బ్రాండ్‌ స్థాపకుడు కరణ్‌ తోరానీ. స్వస్థలం భోపాల్‌లో నానమ్మ చుట్టూ అల్లుకున్న అతని బాల్యమే చేనేత కళల పట్ల అతనిలో ఆసక్తిని రేకెత్తించింది. దేశంలోని నలుమూలలూ తిరిగి ఆయా ప్రాంతాల్లోని చేనేత కళల గురించి అధ్యయనం చేశాడు. అలా ఆరేళ్ల ప్రయాణం తర్వాత ‘తొరానీ’కి రూపమిచ్చాడు. ధర కాస్త ఎక్కువే. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. 

ఓరా జ్యూలరీ
1888లో ముంబైలోని హ్యూస్‌ రోడ్‌లో ప్రారంభమై.. నేడు 38 నగరాల్లో 84 స్టోర్స్‌తో పాటు 5 గ్లోబల్‌ డిజైన్‌ సెంటర్‌లతో అంతర్జాతీయ బ్రాండ్‌గా రూపుదిద్దుకుంది. విలువైన రత్నాలు, వజ్రాలతో తయారయ్యే ఈ డిజైన్స్‌కి మంచి గిరాకీ ఉంది. పలువురు సెలబ్రిటీలకు ఫేవరెట్‌ ఈ బ్రాండ్‌ అనీ పేరుంది. డిజైన్‌ను బట్టే ధర. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు.కథను ఏ భాషలో చెబుతున్నాం, ఏ ఫ్లాట్‌ఫామ్‌ మీద చెబుతున్నాం అనేదాన్ని పెద్దగా పట్టించుకోను. ఫీచర్‌ ఫిల్మ్‌ అయినా వెబ్‌ అయినా హండ్రెడ్‌ పర్సెంట్‌ ఎఫర్ట్స్‌ పెడతాను. ఫలితం గురించి పెద్దగా పట్టించుకోను.

(చదవండి: 'అఖండ' హీరోయిన్‌ ధరించిన చీర ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే!)

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top