'అఖండ' హీరోయిన్‌ ధరించిన చీర ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే!

Akhanda actress Pragya Jaiswal Retro Style In Black Saree - Sakshi

‘కంచె’ సినిమాతో తెలుగులో ఎంటరైన ప్రగ్యా జైస్వాల్‌కి ఇక్కడ అభిమానం గణం ఎక్కువే!. మనం చేసే ప్రతి పనిలోనూ తప్పకుండా ప్లాన్‌ బి ఉండాలి. అప్పుడే ఎక్కడైనా సంతోషంగా ఉండగలం అంటోని ప్రగ్యా. ఇక ఆమెకు అంతటి ఘనమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌కి కారణం తన గ్లామర్. ఆ గ్లామర్‌కొక స్టయిల్‌ని క్రియేట్‌ చేసిన క్రెడిట్‌ ఫ్యాషన్‌దే. ఆ ఫ్యాషన్‌లో ఈ బ్రాండ్స్‌ కూడా ఉన్నాయి.. 

సావన్‌ గాంధీ..
ఢిల్లీకి చెందిన సావన్‌ గాంధీ కొంత కాలం పలు ఫ్యాషన్‌ డిజైనర్స్‌ దగ్గర పనిచేసి.. తర్వాత తన పేరు మీదే ఫ్యాషన్‌ హౌస్‌ని ప్రారంభించాడు. అందమైన డిజైన్స్‌తో అనతికాలంలోనే సూపర్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకున్నాడు.అల్లికలు, కుందన్‌ వర్క్స్‌లోనూ ఈ బ్రాండ్‌ ఫేమస్‌. దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు అమెరికా, లండన్‌లోనూ స్టోర్స్‌ ఉన్నాయి. ధర లక్షల్లోనే! ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇ​​క ప్రగ్యా ధరించిన చీర ధర ఏకంగా రూ. 1,59,000/-.

ఆమ్రపాలి జ్యూలరీ
రాజీవ్‌ అరోరా, రాజేష్‌ అజ్మేరా అనే ఇద్దరు స్నేహితులు.. సంప్రదాయ రాజాభరణాలు, గిరిజన ఆహార్యాన్ని ఆధునిక తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియంను ఏర్పాటు చేశారు. సందర్శనకు వచ్చిన చాలామంది ఆ అభరణాలను ధరించేందుకు ఆసక్తి చూపడంతో అచ్చు అలాంటి నమూనాలనే తయారుచేస్తూ, విక్రయించడం మొదలుపెట్టారు. డిజైన్‌ మాత్రమే యాంటిక్‌ కాబట్టి సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఒరిజినల్‌ యాంటిక్‌ పీస్‌ కావాలంటే మాత్రం వేలంపాటలో లక్షలు పెట్టాల్సిందే. ఆన్‌లైన్‌లోనూ లభ్యం.

ఈనా..
టాప్‌ మోస్ట్‌ లగ్జూరియస్‌ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌లో ఈనా ఒకటి. సంప్రదాయ అల్లికలు, కుందన్‌ వర్క్స్‌ లభించే ఈ పోల్టిస్, క్లచెస్, బకెట్‌ బ్యాగ్స్‌కు ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ మంచి గిరాకీ ఉంది. అందుకే, సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికీ ఈ బ్రాండ్‌ అంటే తగని మోజు. ధర కూడా ఆ రేంజ్‌ లోనే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లోనూ లభిస్తాయి. ఇక్కడ ప్రగ్య ధరించి బ్యాగ్‌ ధర రూ. 9,800

(చదవండి: శృతి హాసన్‌ ధరించి బ్రౌన్‌కలర్‌ చీర ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!)

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top