మాల్యా పెళ్లి సందడి : మెనూలో అదే సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ | Sidhartha Mallya and Jasmine wedding Vijay Mallya serves Kingfisher beer | Sakshi
Sakshi News home page

మాల్యా పెళ్లి సందడి : మెనూలో అదే సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌

Jun 26 2024 12:24 PM | Updated on Jun 26 2024 1:06 PM

Sidhartha Mallya and Jasmine wedding Vijay Mallya serves Kingfisher beer

భారతీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్  విజయ్‌ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా తన చిరకాల స్నేహితురాలు  జాస్మిన్‌ను పెళ్లి చేసుకున్నాడు.

లండన్‌లో జూన్‌ 22న  సిద్ధార్థ-జాస్మిన్ వివాహ వేడుక జరిగింది. అయితే ఈ పెళ్లి సందడిలో వడ్డించిన వంటలు, ఇతర పదార్థాలపై ఇంటర్నెట్‌లో చర్చ నడుస్తోంది.

ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనర్ మనోవిరాజ్ ఖోస్లా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో  ఇంట్రస్టింగ్‌ సంగతులను షేర్‌ చేశాడు. ముఖ్యంగా కింగ్‌ఫిషర్‌ బీర్‌ ఇమేజ్‌ను షేర్‌ చేయడంతో ఇది ఫాలోయర్లను ఆకట్టుకుంటోంది. లండన్‌లో కింగ్‌ పిషర్‌కు మించింది ఏముంటుంది అనే క్యాప్షన్‌తో ఫోటోను కూడా పోస్ట్‌ చేశాడు. ఇంకా కడీపట్టా బుర్రట్టా, పాన్-ఫ్రైడ్ అట్లాంటిక్ సీ బాస్ లాంటి వాటితో పాటు ఇతర వంటకాలున్నాయని తన స్టోరీలో  తెలిపాడు. 

మరోవైపు సిద్ధార్థ-జాస్మిన్ పెళ్లి సంబరాలకు సంబంధించి ఫోటోలు  వైరల్‌ అయ్యాయి. తాజాగా పెళ్లి కళ ఉట్టిపడుతున్న తమ రెండు ఫోటోలను  సిద్ధార్థ  మాల్యా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. అంతకుముందు తన కాబోయే భార్యతో పోజులిచ్చిన  ఫోటోలను షేర్‌ చేసి, తన ఫ్యాన్స్‌కు పెళ్లికబురు అందించిన సంగతి తెలిసిందే.   

Advertisement
 
Advertisement
Advertisement