లోకోపదేశం | Lokopadesham Humorous Instruction for the World, special story | Sakshi
Sakshi News home page

లోకోపదేశం

Oct 30 2026 12:55 AM | Updated on Oct 30 2026 12:55 AM

Lokopadesham Humorous Instruction for the World, special story

హ్యూమరమరాలు

సభ్యసమాజం మాట ఎలా ఉన్నా, లోకేశం తెలివితేటలకు అతడి తండ్రి బాబుబలి మిక్కిలి సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంటాడు.
ఒకరోజు... ‘నాన్నా....నేను ఇంటర్వ్యూకు వెళుతున్నాను’ అన్నాడు లోకేశం.
‘ఏ టీవీ చానల్‌కు ఇంటర్వూ  ఇస్తున్నావు?’ అని అడిగాడు బాబుబలి. 
‘టీవీ చానల్‌ కోసం కాదు. ఉద్యోగం కోసం ఇంటర్య్వూకు వెళుతున్నాను’ అన్నాడు లోకేశం.
‘నీకు ఉద్యోగం చేసే ఖర్మ ఏమిటి నాన్న? నీకు ఉద్యోగం ఇస్తే అది వాళ్ల ఖర్మ! మనకు తరగని ఆస్తులు ఉన్నాయి. అది జనాల ఖర్మ. నీకు ఉద్యోగం ఎందుకు నాన్న? నా ఖర్మ కాకపోతే!’ అన్నాడు 
బాబుబలి.
‘ఉద్యోగం పురుష లక్షణం అని మొన్న ఎక్కడో చదివాను. అందుకే...’ పట్టుదలగా పళ్లు్ల కొరికాడు లోకేశం.

మేనేజర్‌: కొన్ని ప్రశ్నలు అడుగుతాను. పొరపాటున ఒక ప్రశ్నకు జవాబు చెప్పినా నీకు ఉద్యోగం ఇస్తాను. మొదటి ప్రశ్న...తాజా తుఫాన్‌కు అర్నబ్‌ అని ఎందుకు పేరు పెట్టారు?
లోకేశం: న్యూస్‌యాంకర్‌ అర్నబ్‌ గోస్వామి పేరు మీద తాజా తుఫానుకు అర్నబ్‌ అని పేరు పెట్టారు. తాను ఇంటర్వ్యూ చేసే వారిపై అర్నబ్‌ విరుచుకుపడుతుంటాడు కదా! ఇలా విరుకుచుకు పడడాన్ని దృష్టిలో పెట్టుకొని ‘అర్నబ్‌’ అని పేరు పెట్టారు.
మేనేజర్‌: వాటీజ్‌ ఇండియా గేట్‌?

లోకేశం: ఇండియా గేట్‌ అనేది ఫేమస్‌ బాస్మతి రైస్‌ బ్రాండ్‌. ఆ బ్రాండ్‌తో చేసిన బిర్యానీ తినడం అంటే నాకు ఎంత ఇష్టమంటే, నా సామిరంగ... వరుసగా మూడురోజుల పాటు తింటూనే ఉంటాను.
మేనేజర్‌: తాజ్‌మహల్‌ గురించి మీకు తెలిసింది చెప్పండి?
లోకేశం: తాజ్‌మహల్‌ అనేది మన దేశంలోని ఫేమస్‌ టీ బ్రాండ్‌. అరే హుజూర్‌....వాహ్‌ తాజ్‌ బోలియే!
మేనేజర్‌: మా కంపెనీ అదృష్టం బాగుండి మీరు ఒక్క క్వశ్చన్‌కు కూడా సరైన ఆన్సర్‌ ఇవ్వలేదు.
లాస్ట్‌ క్వశ్చన్‌ అడుగుతున్నాను. మా ఖర్మ కాలి ఈ ప్రశ్నకు సమాధానం చెబితే... కచ్చితంగా ఉద్యోగం ఇస్తాను.

లోకేషం: ఛీర్స్‌!
మేనేజర్‌: సపోజ్‌ నువ్వు విద్యాశాఖ మంత్రివి అయ్యావు. నీ హయాంలో ఒక స్కామ్‌ జరిగింది. ఎలా స్పందిస్తావు? ఎలాంటి చర్యలు తీసుకుంటావు?
లోకేషం: స్పందించడమేమిటి? చర్యలు తీసుకోవడమేమిటి? నాన్సెన్స్‌! నా హయాంలో స్కామ్‌ జరిగితే సగర్వంగా గర్విస్తాను. మీసం మెలేస్తాను. తొడ కొడతాను.
మేనేజర్‌: స్కామ్‌ జరిగితే సగర్వంగా గర్వించడమేమిటయ్యా!!!!!!!!?!!!!?
లోకేషం: స్కామ్‌ చేయడం అంటే మాటలు అనుకున్నారా? ఎన్ని తెలివితేటలు ఉండాలనుకున్నారు? అసలు ‘స్కామ్‌’ ఫుల్‌ఫామ్‌ ఏమిటో తెలుసా మీకు? చెబుతాను రాసుకోండి.
ఎస్‌–సూపర్‌
సి–ఛీర్‌ఫుల్‌
ఎ–అమేజింగ్‌ అండ్‌ అదుర్స్‌
ఎం–మాస్టర్‌ మైండ్, మల్టీ టాలెంట్‌
మేనేజర్‌: లోకోపదేశం అంటే ఏమిటో అనుకున్నాను. ఇదా!

– యాకుబ్‌ పాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement