breaking news
instruction
-
పరిశోధనలపై దృష్టి పెట్టాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా దిగ్గజాలుగా ఎదగాలంటే పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు పెద్ద పీట వేయాలని దేశీ ఫార్మా పరిశ్రమకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. వినూత్న ఉత్పత్తులను రూపొందించడంపై దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్ల కోసం కీలక యంత్రపరికరాలను తయారు చేయాలని అటు మెడికల్ టెక్నాలజీ కంపెనీలకు సూచించారు. ఫార్మా–మెడ్ టెక్ రంగంలో పరిశోధనలు, అభివృద్ధి, నవకల్పనలపై జాతీయ పాలసీని ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘అంతర్జాతీయ బహుళ జాతి కంపెనీలు తమ లాభాల్లో 20–25 శాతాన్ని పరిశోధన, ఆవిష్కరణలపై వెచ్చిస్తుంటాయి. కానీ దేశీ కంపెనీలు సుమారు 10 శాతమే వెచ్చిస్తున్నాయి. మనం పరిశోధన ఆధారిత వినూత్న ఉత్పత్తులను తయారు చేయనంతవరకూ అంతర్జాతీయంగా ఈ విభాగానికి సారథ్యం వహించలేము‘ అని ఆయన చెప్పారు. 2047 నాటికి ఫార్మా పరిశ్రమ స్వావలంబన సాధించుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. నాణ్యత కూడా ముఖ్యమే.. భారీ పరిమాణంలో ఉత్పత్తి చేయడమే కాకుండా ఉత్పత్తుల నాణ్యతపై కూడా ఫార్మా పరిశ్రమ దృష్టి పెట్టాలని మాండవీయ చెప్పారు. మరోవైపు, ఫార్మా మెడ్‌టెక్ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించే పథకాన్ని (పీఆర్ఐపీ) కూడా కేంద్రం ఆవిష్కరించింది. ఈ స్కీము బడ్జెట్ రూ. 5,000 కోట్లని మాండవీయ చెప్పారు. పరిమాణంపరంగా 50 బిలియన్ డాలర్లతో భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. వచ్చే దశాబ్ద కాలంలో 120–130 బిలియన్ డాలర్లకు ఎదగగలదని అంచనాలు ఉన్నాయి. -
ఇక ఆడి ఏ8ఎల్ అదుర్స్
ముంబయి: ఓ అజ్ఞాత వినియోగదారుడి సలహా.. ఆడి ఏ8ఎల్ కంపెనీ యాజమాన్యానే కదిలించింది. విశాలంగా, పెద్దదిగా లేదంటూ వచ్చిన ఫిర్యాదుతో ఆ కంపెనీ ఏ8ఎల్ ను ఆరు డోర్లుగా పొడిగించి, కస్టమరే కింగ్ అని నిరూపించింది. ఈ లగ్జరీ కార్లో ఇప్పుడు ఆరుగురు వ్యక్తులు కూర్చొనే సౌకర్యం ఉంటుంది. 20.9 అడుగులాల వెడల్పు, 13.8 అంగుళాల వీల్ బేస్‌గా దీన్ని పొడిగించారు. కారులోని ఏపిల్లర్ నుంచి బ్యాక్ఎండ్ వరకూ ఉన్న ప్రతిభాగాన్ని మళ్లీ పునరుద్ధరించారు. లీమోజీన్ కారు సీట్లలాగా ప్రస్తుతం మార్పులు చేసిన ఏ8ఎల్ కారు సీట్లు కనిపించనున్నాయి. మూడో వరుస సీట్లకు ఎంటర్ టైన్ మెంట్ డిస్ ప్లే, రీఫ్రిజిరేటెడ్ స్టోరేజ్ బాక్స్, రెండు మూడు వరుస సీట్లు వాల్కానో లెదర్ తో పవర్ సర్దుబాటు చేసుకునే విధంగా రూపొందించారు. 7.1 సెకండ్లలో 62 మైల్స్‌ను వెళ్లే సామర్థ్యం ఈ కారుకు ఉంది. ఆడీ ఏ8ఎల్ కారుకు పైన గ్లాస్ ప్యానెల్‌ను అమర్చారు. దీనివల్ల సూర్యకాంతి నుంచి తప్పించుకునే సౌలభ్యం ఉంటుంది. ఈ పొడిగించిన కారు పరిమాణం తక్కువ బరువుతో ఉండి చాలావరకూ అల్యూమినియంతో రూపొందినదై ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ కంపెనీ ఆఫర్ చేస్తున్న ఈ మోడల్ కారు మార్కెట్లో ఆరు డోర్ల లగ్జరీ సెడాన్ గా పేరొందుతోంది.