పులిని చూస్తే పారిపోతాం. కాని ఈ పులిని చూస్తే పట్టుకోవడానికి పరుగెడతాం. నిజమండీ.. పులిలా కనిపించే ఓ కొత్తరకం పిల్లిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దక్షిణమెరికాలోని బొలీవియా దేశం ఆండిస్ పర్వత ప్రాంతాలలో దీనిని కనుగొన్నారు. స్థానికులు‘టిల్కాయో’అని పిలిచే ఈ పిల్లి శాస్త్రీయ నామం ‘లియోపార్డస్ టిల్కాయ్’.
చూడడానికి చిరుతపులిని పోలినట్టు ఉన్నా పరిమాణంలో మాత్రం మన ఇంట్లో పిల్లి కంటే చాలా చిన్నది. దీని శరీరం తల నుంచి తోక వరకు పొడవు కేవలం 46 సెంటీమీటర్లు మాత్రమే (18 ఇంచులు). 1923 తర్వాత తొలిసారిగా కొత్త అడవిజాతి పిల్లిని గుర్తించారు. అంటే వందేళ్ల తర్వాత కొత్తరకం పిల్లిజాతిని గుర్తించారన్నమాట.


