
ఈ నవరాత్రుల ఉపవాసాల్లో సగ్గుబియ్యంతో చేసిన వంటకాలనే ఆరగిస్తుంటారు చాలామంది . ముఖ్యంగా సగ్గుబియ్యంతో చేసే స్వీట్లు రుచి తలుచుకుంటేనే నోరూరిపోతుంటుంది. అలాంటి సగ్గుబియ్యాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా..? వేటితో తయారు చేస్తారు..? మొత్తం విధానం ఎలా ఉంటుంది తదితరాల గురించి సవివరంగా తెలుసకుందామా.!
కొంచె ఒంట్లో నలతగా ఉన్నా..లేదా ఏం తిన్న జీర్ణం కాక ఇబ్బందిగా ఉన్నా..శరీరానికి సత్తువనిచ్చేలా ఈ సగ్గుబియ్యం జావాని వెంటనే తీసుకుంటుంటారు. ఇది తేలిగ్గా అరిగిపోతుంది. పైగా ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అందువల్ల ఉపవాసాల్లో స్ప్రుహ తప్పిపోకుండా ఎనర్జిటిక్‌గా ఉండేందుకు తప్పనిసరిగా ఈ సగ్గుబియ్యంతో చేసే పాయసం, లేదా రెసిపీలు తీసుకుంటుంటారు భక్తులు. మరి ఈ సగ్గుబియ్యం ఎలా తయారవుతాయంటే..
కస్సావా దుంప నుంచి ఈ సగ్గుబియ్యాన్ని తయారు చేస్తారు. ఈ దుంపనే కర్రపెండలం అనికూడా అంటారు. వీటిని ముందుగా శుభ్రం చేసుకుని తొక్క యంత్రం సాయంతో చక్కగా బయటి చర్మాన్ని ఒలిచేస్తారు. ఆ తర్వాత వాటిని పాలు, పిండి మిశ్రమంగా ప్రాసెస్ చేస్తారు. ఆ తర్వాత పూర్తిగా శుద్ధి చేసి ఎండబెట్టి..ఈ స్టార్చ్ పేస్ట్‌ను వరుస యంత్రాల ద్వారా పంపుతారు. చివరి దశలో ఎండిన మిశ్రమాన్ని చూర్ణం చేసి, జల్లెడ ద్వారా పంపి చిన్న చిన్న ముత్యాల లాంటి బంతులను తయారు చేస్తారు.
వీటినే సబుదాన లేదా సగ్గుబియ్యం అని పిలుస్తారు. తర్వాత వీటిని ప్యాక్ చేసి అమ్మకానికి రెడి చేస్తారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది తమిళనాడులోని సబుదాన కర్మాగారంలో చ్రితించిన వీడియో. దీంతో వడలు, దగ్గర నుంచి ఖిచ్డి, పాయసం వంటి పలు రెసిపీలను తయారు చేస్తారు.
(చదవండి: రాజాధిరాజ.. రాజమార్తాండ.. బహుపరాక్! మైసూర్ ప్యాలెస్‌లో నవరాత్రి ఉత్సవాలు)