ఓ మై డాగ్స్‌! | Reggie Tallest Dog Meets Pearl Smallest Dog: Guinness World Records | Sakshi
Sakshi News home page

ఓ మై డాగ్స్‌!

Jun 8 2025 12:31 AM | Updated on Jun 8 2025 12:32 AM

Reggie Tallest Dog Meets Pearl Smallest Dog: Guinness World Records

ఒక అసాధారణమైన స్నేహానికి మూడడుగుల ఎత్తు తేడా ఏమాత్రం అడ్డు రాలేకపోయింది. ఒకటి టీ కప్పు సైజులో పరిగెత్తే పిల్లోడు, ఇంకొకటి సోఫాను బెడ్డుగా వాడే బలమైన కుర్రాడు, కాని, ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన బంధం చూస్తే – ఇది శునకాల స్నేహం కాదు, నిజమైన ప్రేమపాఠం అనిపిస్తుంది. ఈ స్నేహం  ఐడహోలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్ట్స్‌ అధికారుల కారణంగా మొదలైంది.

ప్రపంచంలోనే అతి పొడవైన శునకం రెజీకి (39.6 అంగుళాలు), అతి చిన్నదైన కుక్క పెర్ల్‌ను (3.59 అంగుళాలు) మొదటిసారి పరిచయం చేసినప్పుడు, ఎవరూ ఊహించని విధంగా కళ్ల ముందు ఒక డిస్నీ మ్యాజిక్‌ కనిపించింది. రెజీ, పెర్ల్‌ కలిసింది మొదటిసారే అయినా, ‘ఓయ్‌ బాస్, ఈ ప్రపంచంలోనే మేమే గ్రేట్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్‌’ అని అందరిని నమ్మించేశాయి! రెజీ భారీ ఆకారం చూసి పెర్ల్‌ భయపడకుండా ధైర్యంగా దాని చుట్టూ తిరుగుతూ ఆటలాడుకుంటుంటే, రెజీ తన భారీ కాళ్లను నెమ్మదించి, చిట్టి స్నేహితుడితో కలిసి నడిచింది.

ఈ అందమైన కలయికకు కారణం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ కావొచ్చు కాని, ఫలితంగా ప్రపంచం నిండా నవ్వులు పూశాయి, సోషల్‌ మీడియా హ్యాష్‌ట్యాగ్‌లతో నిండిపోయింది. చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. ఎత్తుల్లో తేడా రావచ్చు, రకాలు భిన్నంగా ఉండొచ్చు కాని, ఒక స్నేహానికి ఇవేమీ అవసరం లేదు, ఒక మంచి మనసే చాలు అని ఈ జంట మరోసారి నిరూపించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement