గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!? | Artificial Egg 3D Printed Chicks | Sakshi
Sakshi News home page

గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?

Nov 8 2026 2:19 PM | Updated on Nov 8 2026 2:19 PM

Artificial Egg 3D Printed Chicks

ఫండే

వింతలు విశేషాలు

కోడి లేదు.. గుడ్లు లేవు.. అయినా కోడి పిల్లలు బయటకు వస్తాయి. ఆశ్చర్యపోతున్నారా! నిజం, అమెరికాకు చెందిన కొలొసల్‌ బయోసైన్సెస్‌ సంస్థ 3డీ ప్రింటింగ్‌తో తయారుచేసిన కృత్రిమ గుడ్డు నుంచి కోడిపిల్లలను పొదిగించినట్లు ప్రకటించింది.

చూడటానికి ప్లాస్టిక్‌ కప్పులా ఉన్నా, లోపల మాత్రం ప్రాణం పెరుగుతోంది. ఇందులోని ప్రత్యేక సిలికాన్‌  పొర పిండానికి అవసరమైన ఆక్సిజన్‌  అందేలా చేస్తుంది. ఈ సంస్థ ఆశయం కేవలం కోడిపిల్లలతోనే ఆగడం లేదు. అంతరించిపోయిన భారీ పక్షి ‘జెయింట్‌ మోవా’ను కూడా తిరిగి తీసుకురావాలనుకుంటోంది.

అయితే, దానికి జన్యు పరిశోధనలు సహా ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ప్రస్తుతానికి అది ఆశ మాత్రమే! మొత్తానికి, ఈ ప్రయోగాలు విజయవంతమైతే, భవిష్యత్తులో కృత్రిమ గుడ్లలోంచి అంతరించిపోయిన పక్షులూ రెక్కలాడిస్తూ బయటకొచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement