breaking news
artificial eggs
-
గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?
కోడి లేదు.. గుడ్లు లేవు.. అయినా కోడి పిల్లలు బయటకు వస్తాయి. ఆశ్చర్యపోతున్నారా! నిజం, అమెరికాకు చెందిన కొలొసల్ బయోసైన్సెస్ సంస్థ 3డీ ప్రింటింగ్‌తో తయారుచేసిన కృత్రిమ గుడ్డు నుంచి కోడిపిల్లలను పొదిగించినట్లు ప్రకటించింది.చూడటానికి ప్లాస్టిక్ కప్పులా ఉన్నా, లోపల మాత్రం ప్రాణం పెరుగుతోంది. ఇందులోని ప్రత్యేక సిలికాన్ పొర పిండానికి అవసరమైన ఆక్సిజన్ అందేలా చేస్తుంది. ఈ సంస్థ ఆశయం కేవలం కోడిపిల్లలతోనే ఆగడం లేదు. అంతరించిపోయిన భారీ పక్షి ‘జెయింట్ మోవా’ను కూడా తిరిగి తీసుకురావాలనుకుంటోంది.అయితే, దానికి జన్యు పరిశోధనలు సహా ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ప్రస్తుతానికి అది ఆశ మాత్రమే! మొత్తానికి, ఈ ప్రయోగాలు విజయవంతమైతే, భవిష్యత్తులో కృత్రిమ గుడ్లలోంచి అంతరించిపోయిన పక్షులూ రెక్కలాడిస్తూ బయటకొచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: గంటల లెక్కన కుక్కల బుకింగ్.. ఇదేం ఐడియా బాసూ! -
చైనా కోడిగుడ్లతో మోసం!
-
చైనా కోడిగుడ్లతో మోసం!
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కృత్రిమ(చైనా) కోడిగుడ్ల అమ్మకాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ బుధవారం విచారణకు ఆదేశించారు. నిజానిజాలను నిర్ధారించుకునేందుకే విచారణకు ఆదేశించినట్లు మంత్రి మీడియా సమావేశంలో చెప్పారు. కృత్రిమ కోడిగుడ్ల అమ్మకాలు జరుగుతున్నాయని ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. అయితే మీడియాలో వస్తున్న కథనాలను బట్టే ఈ విచారణకు ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు. ఆహార భద్రతా కమిషనర్ తో ఈ విషయంపై చర్చిస్తానని చెప్పారు. చైనా గుడ్డుకు సంబంధించిన శాంపిల్ ఉంటే అధికారులకు అందిచాలని రాష్ట్ర ప్రజలను కోరారు. దీనివల్ల మిగిలిన వాటిని గుర్తించడానికి తక్కువ సమయం పడుతుందని చెప్పారు. పొరుగురాష్ట్రమైన తమిళనాడు నుంచి కృత్రిమ గుడ్లు రాష్ట్రంలోకి వస్తున్నట్లు తమకు సమాచారం ఉందని వెల్లడించారు. తమిళనాడు,కేరళ రాష్ట్రలకు సరిహద్దు జిల్లాగా ఉన్న ఇద్దుకిలో కృత్రిమ గుడ్లు పెద్ద ఎత్తున ఉన్నట్లు చెప్పారు. దీనిపై స్పందించిన ఇద్దుకి జిల్లా మెడికల్ అధికారిణి రేఖ కృత్రిమ గుడ్లు అంశంపై విచారిస్తామని అన్నారు.


