చైనా కోడిగుడ్లతో మోసం! | Kerala to probe reports of 'artificial' Chinese eggs | Sakshi
Sakshi News home page

చైనా కోడిగుడ్లతో మోసం!

Oct 12 2016 2:38 PM | Updated on Aug 13 2018 3:34 PM

చైనా కోడిగుడ్లతో మోసం! - Sakshi

చైనా కోడిగుడ్లతో మోసం!

కేరళ రాష్ట్రంలో కృత్రిమ(చైనా) కోడిగుడ్ల అమ్మకాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కృత్రిమ(చైనా) కోడిగుడ్ల అమ్మకాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ బుధవారం విచారణకు ఆదేశించారు. నిజానిజాలను నిర్ధారించుకునేందుకే విచారణకు ఆదేశించినట్లు మంత్రి మీడియా సమావేశంలో చెప్పారు.
 
కృత్రిమ కోడిగుడ్ల అమ్మకాలు జరుగుతున్నాయని ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. అయితే మీడియాలో వస్తున్న కథనాలను బట్టే ఈ విచారణకు ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు. ఆహార భద్రతా కమిషనర్ తో ఈ విషయంపై చర్చిస్తానని చెప్పారు. చైనా గుడ్డుకు సంబంధించిన శాంపిల్ ఉంటే అధికారులకు అందిచాలని రాష్ట్ర ప్రజలను కోరారు. దీనివల్ల మిగిలిన వాటిని గుర్తించడానికి తక్కువ సమయం పడుతుందని చెప్పారు. 
 
పొరుగురాష్ట్రమైన తమిళనాడు నుంచి కృత్రిమ గుడ్లు రాష్ట్రంలోకి వస్తున్నట్లు తమకు సమాచారం ఉందని వెల్లడించారు. తమిళనాడు,కేరళ రాష్ట్రలకు సరిహద్దు జిల్లాగా ఉన్న ఇద్దుకిలో కృత్రిమ గుడ్లు పెద్ద ఎత్తున ఉన్నట్లు చెప్పారు. దీనిపై స్పందించిన ఇద్దుకి జిల్లా మెడికల్ అధికారిణి రేఖ కృత్రిమ గుడ్లు అంశంపై విచారిస్తామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement