ఏఐ మాయ: తల్లి ప్రేమ ఎప్పటికీ చిరస్మరణీయం..! | Reddit Co-founder Alexis Ohanian Uses AI To Relive Memories With His Late Mom, More Details | Sakshi
Sakshi News home page

ఏఐ మాయ: తల్లి ప్రేమ ఎప్పటికీ చిరస్మరణీయం..!

Jun 27 2025 9:26 AM | Updated on Jun 27 2025 10:51 AM

Reddit co-founder uses AI to relive memories with his late mom

తనను తల్లి హగ్‌ చేసుకున్న చిన్నప్పటి ఫోటోను ఏఐ వీడియో క్లిప్‌గా మార్చి షేర్‌ చేశాడు సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ‘రెడిట్‌’ కో–ఫౌండర్‌ ఎలెక్సిస్‌ ఒహానియన్‌. సోషల్‌ మీడియాలో ఈ  ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్‌ కావడం మాట ఎలా ఉన్నా విమర్శలు కూడా వచ్చాయి. 

‘ఫాల్స్‌ మెమోరీ’ అని కొద్దిమంది విమర్శించారు. దీనికి సంబంధించి ఒహానియన్‌ వివరణ ఇచ్చాడు. ‘ఇరవై సంవత్సరాల క్రితం అమ్మ నాకు దూరమైంది. నా దగ్గర అమ్మకు సంబంధించిన వీడియోలు లేవు. అందుకే ఈ ఏఐ వీడియో క్రియేట్‌ చేయాల్సి వచ్చింది. 

 

(చదవండి: బిడ్డ కోసం తల్లడిల్లిన తల్లి..! సాక్షాత్తు ఆ దేవుడే..)

ఈ వీడియో క్లిప్‌ను 50 సార్లు చూసి ఉంటాను’ అన్నాడు ఒహానియన్‌. ఈ వీడియో క్లిప్‌కు 27 మిలియన్‌ల వ్యూస్‌ వచ్చాయి. ‘ఫాల్స్‌ మెమోరీ’లాంటి విమర్శలను పక్కన పెడితే, ఒక ఫోటోగ్రాఫ్‌ను జీవం ఉట్టిపడే వీడియోగా మార్చిన సాంకేతిక నైపుణ్యానికి నెటిజనులు ‘భేష్‌’ అంటున్నారు. 

(చదవండి: మూత్రంతో మరీ ఇలానా..! వైద్యుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

Advertisement
 
Advertisement
Advertisement