
మన దేశంలో జీవించడమే మంచిది ఇక్కడే హాయిగా ఉంటుందని పలువురు విదేశీయలు భారతదేశాన్ని మెచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక విదేశీయురాలు తన పిల్లలను ఇక్కడే పెంచుతానని చెప్పగా, మరొకరు ఇక్కడ జీవిస్తానని అన్నారు. ఇప్పుడు ఈ విదేశీ మహిళ ఏకంగా మన భారతీయుల అలవాట్లు నచ్చాయి, వాటికి అలవాటు పడిపోయాను అని చెబుతుండటం విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టిట తెగ వైరల్ మారింది. మరి ఇంతకీ ఆమె అనుసరిస్తున్న భారతీయ అలవాట్లు ఏంటంటే..
బెంగళూరులో నివశిస్తున్న కంటెంట్ క్రియేటర్ యులియా అస్లమోవా అనే రష్యన్ మహిళ భారతీయ అలవాట్ల గురించి షేర్ చేసుకుంది. మొదట్లో ఆ అలవాట్లు చూసి ఆశ్చర్యపోయానని, ఇప్పుడు అవి తన దైనందిన జీవితంలో భాగమైపోయానని చెప్పుకొచ్చింది. పైగా వాటిని తాను కూడా పాటిస్తున్నానని చెప్పడం విశేషం. అందుకు సంబంధించిన మొత్తం ఎనిమిది అలవాట్లను లిస్ట్ ఔట్ చేసింది. అవేంటో వరసగా చూద్దామా..!
ఈ అలవాట్లు వింతగా ఉన్నప్పటికీ, తన దినచర్యలో భాగమై కొండంతా సంతోషాన్ని మద్దతుని ఇస్తున్నాయని అంటోంది యులియా. ఇంతకీ అవేంటంటే..
అత్తమామలతో జీవించడం: ఇంటిని తాను నిర్వహించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇదొక వరంలా భావిస్తోందామె
చేతులతో తినడం: ఇది ఎంతో కంఫర్ట్‌బుల్‌గా ఉందంటోంది. పైగా ఇలా తింటేనే ఆహారం రుచిగా అనిపిస్తోందట.
కొంచెం ఆలస్యమైనా పట్టించుకోను: ఎవరైనా వ్యక్తులు ఆలస్యంగా వచ్చినా..అందుకు తగ్గట్టుగా తాను ఇతర పనులు ప్లాన్ చేసుకుంటోందట, సమస్యగా ఫీల్ కాలేదట.
ఎక్కువ మంది పనిమనుషులు ఉండటం: ఇది చూడటానికి వింతగా అనిపించినా..ఇదేరాను రాను సౌకర్యవంతంగా, స్మార్ట్‌గా అనిపిస్తోంది
చర్చలు: భారతదేశం నుంచి నేర్చుకున్నది ఇదే. దీన్ని సూపర్ పవర్‌గా అభివర్ణించింది.
మసాలా చాయ్ తాగడం: ఈ టీ తనకెంతో మనశ్శాంతినిస్తుందట. దీన్ని ఆమె మంగోలియన్ చాయ్‌తో పోల్చారామె.
ప్రేమ విలువ: భారతీయ జీవితం సినిమాలు , సంభాషణలు, ప్రేమ చుట్టూ తిరుగుతాయని చెప్పుకొచ్చింది.
బహుళ భాషలు మాట్లాడటం: ఇక్కడ ఉండే బహుళ భాషలు నచ్చాయట. అలాగే త్వరలో హిందీ నేర్చుకోవాలని భావిస్తోందట.
భారతీయ జీవితంలో ప్రేమ చాలా గాఢంగా ఉంటుందని, సినిమాల్లో లేదా రోజువారీ సంభాషణలో చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. భారతదేశం చాలా భావోద్వేగ దేశం. అందువల్ల ఇక్కడ ప్రతీది అద్భుతంగా ఉంటుంది. యులియా పోస్ట్‌ని చూసిన నెటిజన్లు.. భారతదేశ రియల్ స్ఫూర్తిని తెలుసుకున్నారు, స్వీకరించారు కూడా. అలాగే అత్తమామలతో కలిసి ఉండటంపై మీ అభిప్రాయం అత్యంత హర్షాతిరేకంగా ఉందంటూ యులియాపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: పేరెంట్స్ త్యాగాలకు ఫలితం ఏంటో చూపిస్తున్నా..! కుమారుడి భావోద్వేగం..)