నెట్టింట అందమైన అమ్మాయి ఫోటో రియలా? ఏఐ మాయా?

Womans Prettiest Ever Mugshot  AI Or Real - Sakshi

అందమైన ఓ మహిళ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అది నిజంగా అందమైన అమ్మాయి ఫోటోనా లేదా ఏఐ ఫోటోనా అని అందరిలోనూ పలు సందేహాలు రేకెత్తించింది. ఐతే ఆ ఫోటో అధికారిక ప్రయోజనాలకోసం పెట్టిందని కొందరూ లేదు పోలీస్‌ రికార్డుల్లోనిది అంటూ పలు కామెంట్లు చేస్తూ పోస్టు పెట్టారు నెటిజన్లు. ఏదీఏమైన ఒక అందమైన మహిళ ఫోటో నెటిజన్ల మనుసుల్లో చాలా ఉత్సుకతనే రేపింది. మరొకందరూ ఇంతలా ఆ మహిళ ఎవరని? అంతలా ఆరా తీస్తున్నారంటే..మగవాళ్ల బుద్ధి అలానే ఉంటుంది కాబోలు అని కౌంటర్లు ఇచ్చారు.

ఎక్కువ మంది ఏఐతో క్రియోట్‌ చేసిన ఫోటో అని చెప్పగా చాలామంది మాత్రం ఇది సెల్ఫీ ఫోటో అయ్యి ఉండొచ్చని లేదా దేనికో ఉపయోగించేందుకు తీసిన ఫోటో అంటూ పోస్టులు పెట్టారు. అయితే ఈ ఫోటో ఏఐ ఆధారిత ఫోటోనే అనేది క్లియర్‌గా తెలియదు గానీ వెబ్‌సైట్‌ ప్రకారం అది ఏఐ ఫోటో అని 99.4% మంది చెప్పడం గమనార్హం. ఇక్కడొక విషయం క్లియర్‌గా అర్థమవుతుంది.

ఇంతకు మునుపు ఏ అమ్మాయి ఫోటో కనిపించినా ఎవరా బ్యూటీ అని ఆరా తీసేవారు. ఏ ఊరు ఏం చేస్తుంది ఈ తరహాలో ప్రశ్నలు ఉండగా. ఇప్పుడూ అదసలు రియలేనా లేక ఏదైన ప్రకటన కోసం ఉపయోగిస్తున్న ఫోటో అయ్యి ఉండొచ్చనే డౌట్లు లేవెనెత్తుతున్నారు. టెక్నాలజీ తోపాటు మనుషుల్లోనే ఆలోచనల్లో మార్పు వచ్చిందనాలా లేకా టెక్నాలజీ పుణ్యమా! అని  అన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అనాలా ఆలోచించండి. మీకైతే ఈ ఫోటో ఏమనిపిస్తుంది రియల్‌ అనా? లేక ఏఐ ఆధారిత ఫోటోనా?.  గెస్‌ చేయండి.

(చదవండి: అద్భుతం చేసిన అమ్మాయిలు: బాడీనే ‍ కాన్వాస్‌గా..వీడియో వైరల్‌!)

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top