
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సోమవారం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా సివిల్ సర్వీస్ అధికారి విశాఖా యాదవ్ (Vishakha Yadav) ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రంలోని పాపుమ్ పరే జిల్లాలో పర్యటన ఐఏఎస్ అధికారి విశాఖా యాదవ్ప్రధాని మోదీకి స్వాగతం పలికిన దృశ్యాలు నెట్టింటసందడిగా మారాయి. దీంతో ఆ ఆఫీసర్ ఎవరు? ఏంటి? అనే ఆసక్తి మొదలైంది.
అరుణాచల్‌లోని పాపుమ్ పరే జిల్లాలో డిప్యూటీ కమీషనర్‌గా పనిచేస్తున్నారు విశాఖా యాదవ్. ప్రధాని మోదీకి గ్రీటింగ్స్ చెబుతున్న ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మోదీకి వెల్కమ్ చెప్పడం గర్వంగా ఉందంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఎవరీ విశాఖా యాదవ్?
విశాఖ యాదవ్ ఢిల్లీ నివాసి. ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (DTU)లో ఇంజనీరింగ్ చదివిన తర్వాత, ఆమె బెంగళూరులోని సిస్కోలో పనిచేశారు.కానీ ఆమె కల IAS అధికారిణి కావడమే. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారిణి. ప్రస్తుతం ఆమె అరుణాచల్ ప్రదేశ్‌లోని పాపుం పరే జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తన కలను సాకారం చేసుకునేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) పరీక్షకు సిద్ధం కావడానికి విశాఖ యాదవ్ లక్షల జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ఎలాంటి కోచింగ్ లేకుండా సివిల్ సర్వీసెస్ పరీక్షలో సాధించారు. మూడో ప్రయత్నంలో అఖిల భారత స్థాయిలో ఆరవ ర్యాంకును సాధించారు.UPSC పరీక్షలో 2,025 మార్కులకు 1,046 మార్కులు సాధించారు. 1994లో ఢిల్లీలో జన్మించిన ఆమె తండ్రి రాజ్‌కుమార్ యాదవ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ కాగా, ఆమె తల్లి గృహిణి.