బాలీవుడ్ సీనియర్ నటుడు, చిత్ర నిర్మాత నానా పటేకర్ గోవాలో తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన నటుడిగా విలక్షణమైన పాత్రలతో మెప్పించి అశేష అభిమానులను సంపాదించుకున్నారు. దాతృత్వంలోనూ రియల్ హీరో అనిపించుకునేలా సేవలందించాడు. చివరికి ఫిట్‌నెస్‌లో సాహో నానా అని అందిరచేత ప్రశంసలందుకున్నారు. హెల్త్ పరంగా ఆయన ఎంత చురుగ్గా ఉంటాడనేందుకు గత నెలలో నెట్టింట వైరల్ అయిన ఈ వీడియోనే ఉదాహరణ
ఆయన తన మరణానికి కొన్ని నెలల ముందు'గంఛా'తో వర్కౌట్లు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఏడు పదుల వయసులో కూడా ఎంతో సునాయాసంగా వ్యాయామాలు చేస్తూ ఆరోగ్య స్ప్రుహని కలిగించే యత్రం చేశారు. 70 ఏళ్ల వయసులో కూడా చురుకుగా ఉంటూ ఫిట్‌నెస్‌ని కాపాడుకోవడం విశేషం. ఈ వీడియోని ఫోటోగ్రాఫర్ కాస్బేకర్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పంచుకున్నారు. ఆ వీడియోలో నానాపటేకర్ చాలా సులభంగా ట్రైసెప్ డిప్స్ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది.
వ్యాయామం పూర్తయ్యాక కెమెరా వైపు చూస్తూ చిరునవ్వు చిందించారు. తెల్లని బనియన్, టాన్‌రంగు షార్ట్స్ ధరించి మెడలో ఎరుపు రంగు తువాలు వేసుకుని కనిపించారు. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. 75 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నెస్ పట్ల ఆయనకున్న అమిత అంకితభావం, బలాన్ని చూసి విస్తుపోయారు. ఆ వీడియోకి "అహో నానా సాహెబ్...!!! నా ఫిట్‌నెస్ లక్ష్యాలను మళ్లీ కొత్తగా నిర్దేశించుకునేలా చేశారు!!!అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశారు ఫోటోగ్రాఫర్ కాస్బేకర్. అంత ఏజ్‌లో కూడా ఎంత సునాయాసంగా నానాజీ బార్లపై సులభంగా ట్రైసెప్ డిప్స్ చేస్తున్నారు అని రాసుకొచ్చారు పోస్ట్‌లో.
అంతేగాదు ఆయన రోజుకు దాదాపు 2 గంటల పాటు జిమ్‌లో గడుపుతారు. ఇందులో భాగంగా బెంచ్ ప్రెస్, బైసెప్ కర్ల్స్, స్క్వాట్స్ వంటి వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాలు అన్ని చేస్తారు. ఎప్పటికీ చురగ్గా ఉండేలా వర్కౌట్లు చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారట నానా.
కాగా, ఆయన ఫిట్‌నెస్ దినచర్యను చూసి ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు శిల్పాశెట్టి, షారుక్ ఖాన్ తదితర దిగ్గజ నటులు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. అంతేగాదు ఆయన వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని తన వర్కౌట్లతో అద్భుతంగా చెప్పారని అన్నారు.
ఇదీ చదవండి: ‘నానా’ను బలిగొన్న కార్డియాక్ అరెస్ట్.. ఆ కీలక నిమిషాల్లో ఏం చేయాలంటే..


