శోధన
ఎలాంటి ఖర్చు లేకుండా మనస్సుకు ప్రశాంతతను చేకూర్చే ఒక అద్భుతమైన సహజ ఔషధం మ్యూజిక్. కేవలం వినోద సాధనంగానే కాకుండా, శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా సంగీతం ఒక దివ్యౌషధంగా పనిచేస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి.
శాస్త్రీయ సంగీతం మనస్సుకు ఎనలేని ప్రశాంతతను, నిశ్చలతను ఇస్తే, రాప్ సంగీతం జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మానసిక బలాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది. అలాగే పక్షుల కిలకిలరావాలు, వాన జల్లుల చప్పుడు, సముద్రపు అలల ధ్వనులు గుండె వేగాన్ని నియంత్రించి, ఒత్తిడిని పూర్తిగా దూరం చేస్తాయి.
అందువల్ల మనకు నచ్చిన సంగీతాన్ని వినడం వల్ల మన మెదడులోని రసాయన ప్రక్రియల్లో సానుకూల మార్పులు వస్తాయి. ఇది ఒత్తిడిని కలిగించే హార్మోన్లను తగ్గించి, మూడ్‌ను మెరుగుపరుస్తుంది. ప్రతికూల ఆలోచనల నుంచి మనస్సును పక్కకు మళ్లించడానికి ఇది ఒక సులువైన మార్గం.
ఆఫీసులో ప్రతిరోజూ 30 నిమిషాల పాటు సంగీతం వినే ఉద్యోగుల్లో కేవలం నెల రోజుల్లోనే ఒత్తిడి స్థాయిలు భారీగా తగ్గినట్లు పరిశోధనల్లో గుర్తించారు.
అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఉత్సాహభరితమైన పాటలు వింటూ ఇల్లు లేదా డెస్క్ శుభ్రం చేసుకోవడం వల్ల అలసట తెలియదు. అలాగే, చదువుకునేటప్పుడు లేదా ఆఫీస్ పనులు చేసేటప్పుడు లిరిక్స్ లేని కేవలం ఇ¯Œ స్ట్రుమెంటల్ సంగీతాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కాసేపు ప్రశాంతత కోసం హెడ్‌ఫోన్స్ తగిలించుకుని మీకు నచ్చిన సంగీత ప్రపంచంలోకి వెళ్ళిపోవడమే ఒత్తిడికి సరైన పరిష్కారం!


