
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నాం కదా మనకేంటి అనుకుంటాం. ఇద సహజం. కానీ ఆ ఆలోచనే ముమ్మాటికి తప్పట. ఆరోగ్యకరమైన ఆహారంతోనే బాగుంటాం అనుకోవడం అనేది అవాస్తవమట. దాంతో బాడీకి కావల్సిన శారీరక శ్రమ తప్పనిసరి అట. పాపం ఇలాంటి అపోహతోనే చేజేతులారా ఆరోగ్యాన్ని పాడుచేసుకోని బాధపడుతోంది ఓ కేన్సర్ బాధితురాలు. తనలాంటి తప్పిదాలు చేయొద్దంటూ బాడీ చెప్పే సంకేతాలను వినండి..అద చెబుతున్నట్లుగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన బాధను షేర్‌చేసుకుంటూ ఆరోగ్య స్పృహను కలిగిస్తోందామె.
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లనే అనుసరిస్తున్నాం కదా అనారోగ్యం దరిచేరదు అనుకుంటే పొరబడినట్టేనని అంటోంది 29 ఏళ్ల మోనిక చౌదరి. తాను పోషకవంతమైన ఆహారాన్ని తీసుకునేదాన్ని తను మంచి ఆహారపు అలవాట్లనే అనుసరించానని అయినప్పటికీ స్టేజ్ 4 కేన్సర్‌తో పోరాడుతున్నని వాపోయింది. అందుకు కారణాలేంటో కూడా ఆమె వివరించింది.
ఒత్తిడి ఆరోగ్యాన్ని ఎలా చిత్తు చేసిందంటే..
తాను మంచి ఫుడ్‌నే తీసుకునేదాన్ని అని అంటోంది. వేయించిన పదార్థాలు, జంక్‌ఫుడ్ జోలికి అస్సలు వెళ్లదట. అయితే వృత్తిరీత్యా ఎక్కువగంటలు స్క్రీన్ సమయం, పనిభారం తనకు తెలియకుడానే ఒత్తిడిని పెంచేసి శారీరకంగా ప్రభావితం చేశాయంటోంది.
ఇంతకుముందు సాయంత్రాలు చేసే జాగింగ్ వంటి దినచర్యలకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. చెప్పాలంటే పెద్దగా కదలికలు లేదు, శారీరక శ్రమ అనే దినచర్య పూర్తిగా లేకుండాపోయింది. అక్కడికి తన బాడీ సంకేతాలు ఇస్తునే ఉందని, కానీ తాను మాత్రం ఇది పని ఒత్తిడి వల్లే అనుకుంటూ లైట్ తీసుకుందట. సాధ్యమైనంత తొందరలో ఇదివరకటి జీవనశైలిని అనుసరించి వ్యాయామాలు చేద్దా అనుకుంటూనే ఉండేదాన్ని తప్ప..ఎప్పుడూ ఆచరణలోకి తీసుకురాలేకపోయానని వాపోయింది.
అలా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూనే వచ్చానని చెప్పుకొచ్చారామె. ఫలితంగా అలిసిపోవడం, అసౌకర్యంగా ఉండటం వంటి కొద్దిపాటి సంకేతాలు వస్తూనే ఉన్నా..ఆ..! అదంతా పని ఒత్తిడి, నిద్రలేక వచ్చేవే కామన్ అనుకుని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదని చెబుతోంది మోనిక. అప్పుడే ఒకరోజు ఉన్నటుండి స్ప్రుహ తప్పి పడిపోవడం..ఇక అలా బెడ్‌కే పరిమితమయ్యేలా స్టేజ్ 4 కొలొరెక్టల్ కేన్సర్ నిర్థారణ అయ్యిందని తెలిపింది.
ఒక్కసారిగా తన కాళ్ల కింద భూమి కంపించిపోతున్నట్లుగా.. చెప్పలేని ఏదో బాధ గుండెల్లోంచి పొంగుకొచ్చిందంటూ కన్నీటి పర్యంతమైంది. శారీరక వ్యాయమాల పట్ల చూపిన నిర్లక్ష్యం, అశ్రద్ధ ఫలితానికి భారీ మూల్యమే చెల్లించుకుంటున్నానని నెమ్మది నెమ్మదిగా అర్థమవ్వడం ప్రారంభమైందంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చింది.
కష్టపడటంలోనే కాదు, ఆరోగ్య విషయంలోనూ రాజీకి తావిస్తే..నిర్థాక్షిణ్యంగా అనారోగ్యం కోరల్లో చిక్కుకుపోతామని హెచ్చరిస్తోంది మోనికా. సాధ్యమైనంతవరకు మన బాడీ సంకేతాలతో కోరే శ్రద్ధపై ఫోకస్ పెట్టి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అన్నింట్లకంటే విలువైనది, వెల కట్టలేని సంపద ఆరోగ్యమేనని, అదే మహాభాగ్యం అని అంటోంది కేన్సర్ బాధితురాలు మోనిక.
(చదవండి: అలాంటి ఇలాంటి అధిక బరువు కాదు..! ఏకంగా 325 కిలోలు..చివరికి..)