దీపావళి అంటే దీపాల పండుగ మాత్రమే కాదు, బాణసంచా మెరుపులు పండుగ కూడా! చిటపటలాడే కాకరపువ్వులు, ధగధగ వెలిగే మతాబులు, దడదడ పేలే టపాకాయల సందడి లేకుండా దీపావళి పండుగను ఊహించుకోవడం కష్టం. మన దేశంలో దీపావళికి మాత్రమే బాణసంచా కాలుస్తారు. కొన్ని ఇతర దేశాల్లో వేర్వేరు వేడుకల్లో బాణసంచా కాలుస్తారు.
చైనాలో వారి సంప్రదాయక చాంద్రమాన పంచాంగం ప్రకారం జరుపుకొనే నూతన సంవత్సర వేడుకల్లోను, లాంతర్ల పండుగలోను బాణసంచా కాలుస్తారు. అమెరికాలో వారి స్వాతంత్య్ర దినోత్సవం జూలై 4న బాణసంచా కాలుస్తారు. బ్రిటన్లో ఏటా నవంబర్ 5న ‘గై ఫాక్స్ నైట్’ సందర్భంగా బాణసంచా కాలుస్తారు. ఇలాగే, ఇతర దేశాల్లోనూ వారి వారి స్థానిక వేడుకల్లో బాణసంచా కాల్చే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. బాణసంచా గురించి గణాంకాల్లో కొన్ని ముచ్చట్లు తెలుసుకుందాం...

ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 6.41 లక్షల టన్నుల బాణసంచా ఉత్పత్తి జరుగుతోంది. బాణసంచా ఉత్పాదనలో చైనా, భారత్, పాకిస్తాన్ తొలిమూడు స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన అన్ని దేశాల్లోనూ కలుపుకొని వార్షిక సగటు ఉత్పాదన 1,03,000 టన్నుల వరకు ఉంటోంది.
ఇదీ చదవండి: అండ పిండ బ్రహ్మాండ కూష్మాండం


