
విలాసవంతమైన ఐ ఫోన్ అంటే అందరికీ మోజే. అందులోనూ ఇటీవల అధునాతన ఫీచర్ల ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసింది యాపిల్. దీంతో యాపిల్ లవర్స్‌లో మరింత క్రేజ్ పెరిగింది. దీనికోసం ఎగబడి, ఘర్షణకు దిగిన వీడియోలు కూడా నెట్టింట హల్ చల్ చేసిన సంగతి తెలిసిందు. ఎలాగైనా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను (iphone 17pro max) దక్కించుకునేందుకు కొన్ని అసాధారణ మార్గాలను ఎంచు కుంటున్నారు. తాజాగా దానం చేయండి ప్లీజ్.. అంటూ ఆన్‌లైన్‌లో అడుక్కుంటున్న ఒక ఇన్‌ఫ్లూయెన్సర్ (బ్యూటీ క్వీన్) వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటో చూద్దా రండి!
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌కు చెందిన కంటెంట్ సృష్టికర్త, 'బ్యూటీ క్వీన్' మహి సింగ్ తన అనుచరులను QR కోడ్ ద్వారా చిన్న మొత్తంలో విరాళంగా ఇవ్వమని అభ్యర్థించింది. ఒక్కొక్కరూ ఒక్కో రూపాయి, లేదా రెండు రూపాయల చొప్పున దానం చేస్తే, ఆ డబ్బులతో ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ను కొనుక్కుంటానంటూ వేడుకుంటోంది.
చదవండి: చదివింది 12 th.. సంపాదన నెలకు రూ. 3 లక్షలకు పైనే
ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే మూడు నెలల క్రితమే తన తండ్రి తనకు ఐఫోన్ 16 కొని ఇచ్చాడనీ, కానీ తాను తాజా మోడల్ కోసం అడిగినప్పుడు,నిరాకరించాడని చెబుతోంది. అక్టోబర్ 21న తన పుట్టినరోజు సమీపిస్తుండటంతో, కొత్త ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలని ఆరాటపడుతోంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ కలర్ , డిజైన్ భలే నచ్చాయనీ, అది తన “కలల ఫోన్”గా అభివర్ణించింది. ఈ విషయంలో తనకు సపోర్ట్‌గా చేసిన వారందరికీ రుణపడి ఉంటానని తెలిపింది.
भीख मांगने का नया तरीका है
माही सिंह को 17 मैक्स प्रो मोबाइल चाहिए
जिसके लिए पब्लिक से पैसा मांग रही हैं 😂#ModiBhajanlal4Rajasthan pic.twitter.com/sRNFGLYio5— Surendra Yadav (@Surendr0032083) September 25, 2025
దీంతో ఆన్‌లైన్‌లో చాలామంది ఆమెను తిట్టిపోస్తున్నారు. అడుక్కోవడానికి ఇదోమార్గం... పనికిమాలిన పని విమర్శించారు ఇలాంటి వారికి దానం చేస్తే పుణ్యం కంటే పాపమే వస్తుందని కొందరు, ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ఇదో చీప్ ట్రిక్ అంటూ మరికొందరు. మండిపడ్డారు. మహి సింగ్ బ్యూటీ క్వీన్ అనే ఐడీతో వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది.