కుక్కలకూ తప్పని డయాబెటిస్ ప్రాబ్లం! | How human food cause obesity in dogs details here | Sakshi
Sakshi News home page

కుక్కల బరువు పెంచుతున్న మన ఆహారం

Oct 7 2026 6:36 PM | Updated on Oct 7 2026 6:48 PM

How human food cause obesity in dogs details here

అధిక బరువు సమస్య మనుషులకే కాదు, కుక్కలనూ పీడిస్తోంది. ఢిల్లీ వీధికుక్కలలో పెరుగుతున్న బరువు ఇందుకు నిదర్శనం. దీనికి తోడు ‘ఫ్యాట్‌ డాగ్స్‌ ఆఫ్‌ ఢిల్లీ' పేరుతో పోటీలు నిర్వహించడం చూస్తుంటే ఈ సమస్య ఏ స్థాయిలో విస్తరించిందో తెలుస్తోంది. జంతు ప్రేమికులకు ఇది సరదా విషయంగా కనిపిస్తోంది, కానీ వైద్యులు ఏ మాత్రం సమర్థించడం లేదు.

ఇదిలా ఉండగా కుక్కలు బరువు పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తే అవి తీసుకుంటున్న ఆహారమేనని నిర్ధారణ అయింది. నగరంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు, దుకాణదారులు వీధి కుక్కలపై చూపించే ప్రేమ ప్రధాన కారణం. ఇక రెస్టారెంట్‌లు, జంక్‌ఫుడ్‌ స్టాల్స్‌ వాళ్లు మిగిలిపోయిన పదార్థాలు, రెసిడెన్షియల్‌ కాలనీలలో తిరిగే వీధికుక్కలకు మిగిలిపోయిన రొట్టెలు, బిస్కెట్లు, అన్నం, నూనె పదార్థాలను పెడుతున్నారు. రకరకాల వ్యక్తులు వేర్వేరు ఆహారాలను అందించడం, కుక్కలు అవసరానికి మించి తినడం వల్ల ఎక్కువ కేలరీలను తీసుకుంటున్నాయి. దీనికి తోడు, వాటికి సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల వేగంగా బరువు పెరుగుతున్నాయి.

ఢిల్లీ నగరంలో మార్కెట్‌లో తిరిగే కుక్కలు ఆహారం కోసం 50 మీటర్ల దూరం కూడా నడవాల్సిన అవసరం లేకనే రోజుకు నాలుగైదు సార్లు ఆహారం తింటున్నాయి. బరువు మితిమీరి పెరగడం వల్ల వాటికి కీళ్ల నొప్పులు, మధుమేహం, శ్వాసకోశ సమస్యలు, గుండె సమస్యలు వస్తున్నాయని పశువైద్యులు హెచ్చరిస్తున్నారు. అన్నట్లు ఫ్యాట్‌ డాగ్స్‌ ఆఫ్‌ ఢిల్లీ పోటీలో విజేత గోలా అనే కుక్క బరువు 75 కేజీలు. అయితే అది అధిక బరువు కారణంగా ఎదురైన ఆరోగ్య సమస్యలతోనే మరణించింది.

ఇదీ చ‌ద‌వండి: డూమ్స్ డే.. న‌వంబ‌ర్ 13న ఏం జ‌ర‌గ‌బోతోంది?

అలాగే మరో విమర్శ కూడా ఈ సందర్భంగా వినిపించింది. ఇలాంటి అనవసరమైన పోటీలు నిర్వహించడం, వాటికి సోషల్‌ మీడియాలో ప్రచారం కల్పించడం, ప్రజాప్రతినిధిని ఎన్నుకునే ఎన్నికలను పోలిన ప్రచార ఆర్భాటం, పోస్టర్లు వేయడం, భౌతికంగా ఎన్నికలు నిర్వహించడం కోసం సమయాన్ని వినియోగించే బదులు వీథికుక్కల సంక్షేమం కోసం పని చేసి ఉండాల్సింది అనే అభిప్రాయం వ్యక్తం అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement