నూనె.. వత్తి లేకున్నా నిరంతరాయంగా వెలిగే దీపం | Eternal Flame of Jwalamukhi Mystery Beyond Science | Sakshi
Sakshi News home page

నూనె.. వత్తి లేకున్నా నిరంతరాయంగా వెలిగే దీపం

Jun 27 2026 10:28 PM | Updated on Jun 28 2026 6:37 PM

Eternal Flame of Jwalamukhi Mystery Beyond Science

ప్రకృతి నియమాలకు లొంగని ఒక అద్భుతం..! సైన్స్ సైతం చేతులెత్తేసిన ఒక అంతుచిక్కని రహస్యం..! శతాబ్దాలుగా ఎలాంటి చమురు.. అంటే నూనె లేదు..! వత్తి లేదు..! కానీ, నిరంతరాయంగా అగ్ని జ్వాలలు వెలుగుతూనే ఉన్నాయి. మొఘల్ చక్రవర్తి అక్బర్ సైన్యం కూడా.. ఆ జ్వాలను ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నించి.. నిరంతరాయంగా నీళ్లు పోసినా.. ఆరని ఆ జ్వాల వెనక ఉన్న మర్మమేంటి? హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా లోయలో కొలువైన జ్వాలాజీ ఆలయంలో వింతలు, విశేషాలు తెలుసుకుందాం..

భూగర్భంలో ఉండే మీథేన్ గ్యాస్ వల్ల ఈ మంటలు వస్తున్నాయని భావించి, ఓఎన్‌జీసీ (ONGC) శాస్త్రవేత్తలు ఇక్కడ పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు. కానీ ఆశ్చర్యకరంగా... ఇక్కడ ఎలాంటి గ్యాస్ నిల్వలు లేవని తేలింది! ఆ గ్యాస్ ఎక్కడి నుండి వస్తోంది? అసలు ఇంధనం లేకుండా మంటలు ఎలా వెలుగుతున్నాయి? అన్నది నేటికీ సైన్స్‌కు అందని ఒక ఛేదించలేని రహస్యం. సైన్స్ సరిహద్దులు ముగిసేచోట ఆధ్యాత్మికత మొదలవుతుందనడానికి జ్వాలాజీ ఆలయమే ఒక సజీవ సాక్ష్యం. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement