సక్సెస్‌ అంటే సంపాదన, పెళ్లి, మాృతత్వం కాదు..! | Dubai Woman Redefines Success At 41 Goes Viral | Sakshi
Sakshi News home page

సక్సెస్‌ అంటే సంపాదన, పెళ్లి, మాృతత్వం కాదు..!

Jun 24 2026 5:27 PM | Updated on Jun 24 2026 6:08 PM

Dubai Woman Redefines Success At 41 Goes Viral

సాధరణంగా అమ్మాయిలు చక్కగా పెళ్లి చేసుకోవడం, మాతృత్వం స్వీకరించడం, ధనవంతుడైన భర్త రావడం, మంచి ఉద్యోగం సంపాదించడం తదితరాలను సక్సెస్‌గా భావిస్తారు. కానీ అది కాదు విజయం అంటూ సరికొత్త అర్థాన్ని ఇచ్చింది ఈ పోషకాహార నిపుణురాలు. ప్రతి మహిళ తనను తాను ఎలా అనుకుంటుందో..ఎప్పటి నుంచో మనపై రుద్దినట్టుగా మనం ఎలా జీవిస్తూ ఉండిపోతున్నామో సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారామె. ఆ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవ్వడమే కాదు అమ్మాయిల దృక్పథం ఎలా ఉండాలో అవగాహన కల్పిస్తున్నట్లుగా ఉండటంతో అందరు ప్రశంసిస్తూ పోస్టులు పెడుతుండటం విశేషం.

దుబాయ్‌కు చెందిన పోషకాహార నిపుణురాలు రాశి చౌదరి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పోస్ట్‌ని షేర్‌ చేశారు. "మనం విజయం అనగానే మంచి ఉద్యోగం, మంచి జీతం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం వంటి ప్లాన్‌లు వేసేసుకుంటాం. కానీ జీవితం మన ప్రణాళికలను చెత్తబుట్టలో పడేసి వాస్తవ ప్రపంచాన్ని పరిచయం చేసేలా విచిత్ర మార్గాన్ని ఇస్తుంది. 

సరిగ్గా ఇలానే తనకు జరిగిందంటూ తన కథను పంచుకుంది. తాను 21 ఏళ్ల వయసున్నప్పుడూ ఒక ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలని, అందమైన గృహిణిగా ఉండాలని, ఇద్దరు పిల్లలను కనాలని అనుకున్నాను. కానీ అవేమి జరగలేదు ప్రస్తుతం తనకు 41 ఏళ్లు అని, సుమారు 40 మందికి పైగా ఉద్యోగులతో రెండు వేర్వేరు వ్యాపారాలను నడుపుతున్నా. అయితే ఈ జర్నీలో నేనే ధనవంతురాలినయ్యానని, తన కెరీర్‌ ప్లాన్‌ ప్రకారం ఒకటి నిజమైంది. 

ఎందుకంటే 25 ఏళ్ల వయసు వచ్చేసరికి, ధనవంతురాలినయ్యా, అలాగే దుబాయ్‌లో ఒక అపార్ట్‌మెంట్‌ ఉంది. బంధువులకు అసూయ కలిగించే విలాసవంతమైన జీవితం నాది. అయినా ఇది నాజీవితంలో ఎందుకు అనిపించడం లేదు. అసలు నా విజయాలను నేను ఎందుకు ఆస్వాదించలేకపోతున్నా. ఎందుకంటే అందరి అమ్మాయిల్లానే నన్ను ఎవరో శక్తిమంతమైన వ్యక్తి ఎంపిక చేసుకునే వ్యక్తిగా భావించడం లేదా నాకు ఏ శక్తిమంతమైన వ్యక్తి అవసరం రానంతగా సక్సెస్‌ అదుకోవడం. అనే రెండు ఆలోచనలతో పోరాడుతూ ఉండిపోయా. 

ఈ సందిగ్ధంలో అస్సలు మనకేం కావాలన్నిది మర్చిపోతాం అందువల్ల మన సాధించిన విజయాలను ఆస్వాదించడం మర్చిపోతుంటాం. ఇప్పుడు సక్సెస్‌ పట్ల నా దృక్పథం మారింది. నీకు ఏం కావాలో నిర్ణయించుకునే ధైర్యం కలిగి ఉండటమే అతి పెద్ద గెలుపు. అదే స్వేచ్ఛకు అసలైన అర్థం. కేవలం కెరీర్‌లో సక్సెస్‌ లేదా డబ్బు సంపాదన విజయం కాదని, అది అసలైన స్వేచ్ఛ కూడా కాదని చెప్పుకొచ్చింది రాశి చౌదరి." నెటిజన్లు కూడా నిజం మేడం మీరు చెప్పేది ముమ్మాటికీ కరెక్ట్‌ అంటూ మద్దతిస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: ఆమె దృఢ సంకల్పం ముందు అనారోగ్యమే చిన్నబోయింది!)

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement