పాలు, చక్కెరలా సంసారం | Divorce Couple United In Bengaluru | Sakshi
Sakshi News home page

పాలు, చక్కెరలా సంసారం

Jul 13 2026 12:08 PM | Updated on Jul 13 2026 12:08 PM

Divorce Couple United In Bengaluru

జాతీయ లోక్‌ అదాలత్‌లో దాఖలు చేసిన తమ విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకుని ఒక యువ జంట మళ్లీ ఒక్కటయ్యారు. ఏడాది క్రితం, మండ్య జిల్లాలోని కె. ఆర్‌. పేట తాలూకాలోని ముద్దనహళ్లి గ్రామానికి చెందిన హరీష్‌ మైసూరుకు చెందిన కవన విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

ఆదివారం లోక్‌ అదాలత్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు వారికి బుద్ధిమాటలు చెప్పారు. ‘జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న బాధలు, సమస్యల గురించి చింతించకుండా, పాలలో చక్కెర కలిసిపోయి రుచిని పెంచినట్లుగా, ఒకరిపై ఒకరు ప్రేమ, నమ్మకంతో జీవించాలి’ అని సీనియర్‌ జడ్జి సుధీర్‌ వివరించారు. కనువిప్పు కలిగిన ఆ యువ జంట రాజీపడి తిరిగి ఒక్కటి అవుతామని తెలిపారు. వెంటనే పూలదండలు తెప్పించి మార్పించారు. న్యాయవాదులు హొన్నెనహళ్లి హెచ్‌. వి. రవి, కామనహళ్లి బోరేగౌడ, వి. కె. స్వరూప్‌ తదితరులు పాల్గొన్నారు. 

- బెంగళూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement