హీరోయిన్‌లా కనిపించాలని వందకుపైగా సర్జరీలు! అందుకోసం.. | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌లా కనిపించాలని వందకుపైగా సర్జరీలు! అందుకోసం..!

Published Wed, Mar 27 2024 11:06 AM

Chinese Teen Spends Rs 4 Crore On 100 Plastic Surgeries - Sakshi

అందంగా కనిపించాలని ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకుంటారు చాలమంది. ఇలా అందం కోసం చేయించుకున్న సర్జరీలు వికటించి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇలా ఒకటో రెండో సర్జరీలు అయితే ఓకే. కానీ ఇక్కడొక అమ్మాయి తనకు నచ్చిన హీరోయిన్‌లా ఉండాలని ఎన్ని సర్జరీలు చేయించుకుందో వింటే కంగుతింటారు. ఈ విచిత్ర ఘటన చైనాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. తూర్పు చైనాలోని జెజియాంగ్‌ ప్రావిన్స్‌కు చెందిన ఝూ చునా జస్ట్‌ 13 ఏళ్ల వయసుకే ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకోవాలనుకుంది. తనకు ఇష్టమైన నటి ఎస్తేర్‌ యులా ఉండాలని కోరుకుంది. ఇలా ఈ ఏజ్‌లోనే ప్లాస్టిక్‌  సర్జరీలుచేయించుకోవాడానికి ప్రధాన కారణం..ఆమె స్నేహితులు, బంధువులు తన తల్లి కంటే అందంగా లేవని చెప్పడం తట్టుకోలేకపోయింది. అదీగాక తన తోటి విద్యార్థులు కూడా అందంగా ఉండటం వల్లే కాన్ఫిడెంట్‌గా ఉన్నారని నమ్మింది. ఇవన్నీ కలగలసి చునాని ఆత్మనూన్యత భావంలోకి నెట్టి..తన రూపాన్ని మార్చుకోవాలనే చర్యకు ప్రేరేపించాయి. అలా చునా 13 ఏళ్ల నుంచి ప్లాస్టిక్‌ సర్జరీల చేయించుకోవడం ప్రారంభంచింది. అయితే ఆమె తల్లి తొలి ఆపరేషన్‌కి సపోర్ట్‌ చేసి డబుల్‌ కనురెప్పల ప్రక్రియకు అనుమతించింది.

ఆ తర్వాత నుంచి చునా ఒక్కొక్కటిగా రూపాన్ని మార్చుకునే ప్రక్రియలో నిమగ్నమైపోయింది. అలా పాఠశాల విద్యకు కూడా దూరమయ్యింది. ఇలా ఆమె దాదాపు అన్ని రకాల ప్లాస్టిక్‌ సర్జరీలను దాదాపు వందకు పైగా చేయించుకుంది. వాటిలో రినోప్లాస్టి, బోన్‌ షేవింగ్‌ వంటి క్రిటికల్‌ ప్లాస్టిక్‌ సర్జరీలు కూడా ఉన్నాయి. డాక్టర్లు తన కళ్లను పెద్దవి చేసే పని చేయడం కుదరదని హెచ్చరించారు. అయినా సరే లెక్కచేయక వేరే డాక్టర్‌ని సంప్రదించి చేయించుకుంది. ఆ సర్జరీల్లో అత్యంత పెయిన్‌తో కూడిన సర్జరీ బోన్‌ షేవింగ్‌. దీన్ని ఏకంగా పది గంటలపాటు చేస్తారు వైద్యులు. దీని కారణంగా 15 రోజుల పాటు మంచానికే పరిమితమయ్యింది. ఇన్ని నరకయాతనలు అనుభవించినా కూడా.. ఎక్కడ ఏ మాత్రం తగ్గకుండా అచ్చం తను ఇష్టపడే హీరోయిన్‌లా ఉండే సర్జరీలు చేయించుకోవడం ఆపకపోవడం కొసమెరుపు.

ఇక్కడ ఏ వైద్యుడు ఆమెకు ఒక్కసారి ప్లాస్టిక్‌ సర్జరీ చేశాక మరో సర్జరీ చేసేందుకు ముందుకు వచ్చేవాడు కాదు. అయినా ఆ తిరస్కరణలు కూడా పట్టించుకోకుండా ఇంకో డాక్టర్‌ ..ఇంకో డాక్టర్‌ అంటూ సంప్రదిస్తూ ఆపరేషన్‌ చేయించుకుంది. ఇలా ఆమె వందకు పైగా చేయించుకున్న ప్లాస్టిక్‌ సర్జరీల కోసం దాదాపు రూ. 4 కోట్లకు పైగా ఖర్చు చేసిందట. అయితే ఇన్ని ఆపరేషన్‌లకు చునా తల్లి కూడా సపోర్ట్‌ చేయలేదు. ఇక ఆమె తండ్రి చునా కొత్త రూపాన్ని అస్సలు అంగీకరించ లేదు.

అలాగే ఆమె స్నేహితులు సైతం ఆమె కొత్త రూపాన్ని చూసి చునా అని గుర్తుపట్టులేకపోయారు. ఏదీఏమైతేనే చునా అనుకున్నది సాధించి అన్ని బాధకరమైన సర్జరీ ప్రక్రియలను చేయించుకుని మరీ తనకు ఇష్టమైన హీరోయిన్‌లా మారాలనే కలను నిజం చేసుకుంది. ప్రస్తుతం చునాకి 18 ఏళ్లు. ఇక తన శస్త్రచికిత్సా ప్రయత్నాలను కూడా ముగించినట్లు ప్రకటించింది. మరీ ఇంతలా అందం కోసం ప్రాణాలనే పణంగా పెట్టే వెర్రీ మనుషులు ఉంటారా? అనిపిస్తుంది కదూ!..

(చదవండి: చెఫ్‌గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!)


 

Advertisement
 
Advertisement