
ఏఐ కారణంగా భవిష్యత్తులో చాలా ఉద్యోగాలు ఉండవు అంటూ సర్వత్రా ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ, ఎంతటి ఏఐ సాంకేతికత అయినా..మానవుని శక్తిమంతమైన పని ముందు అల్పమైనవిగానే మిగిలిపోతున్నాయి. ఏ సాంకేతికతైన కొంత వరకు మానవులు అవసరాన్ని తగ్గిస్తుందేమో గానీ పూర్తిస్థాయిలోమాత్రం కానే కాదు అని చెప్పొచ్చు. అందుకు ఉదాహరణే ఈ ఉదంతం. ఇక్కడొక వ్యక్తి చాట్‌జీపీటీని నమ్మి చేజేతులారా ఆరోగ్యాన్ని పాడుచేసుకుని ఆస్పత్రి పాలయ్యాడు.
తన ఆహారాన్ని మరింత మెరుగుపరుచుకోవడం ఎలా అని చాట్‌జీపీటీ సలహా కోరాడు. అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని తూచాతప్పకుండా పాటించి ఆస్పత్రి పాలయ్యాడు. అమెరికాకు చెందిన వ్యక్తి ఎలాంటి మానసిక, అనారోగ్య చరిత్ర లేని వ్యక్తిగా గుర్తించారు వైద్యులు. అతడు కేవలం ఏఐ చాట్‌బాట్ కారణంగానే ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నట్లు నిర్థారించారు. ఆ చాట్‌జీపీటీలో టేబుల్ సాల్ట్ ప్రతికూలతలను, ఆరోగ్య ప్రభావాల గురించి కూలంకషంగా తెలుసుకుని దాన్ని పూర్తిగా తొలగించాడు.
ఆ ఉప్పు స్థానంలో సోడియం బ్రోమైడ్‌తో భర్తి చేయొచ్చని చాట్‌జీపీటీ సూచించడంతో దాన్ని గుడ్డిగా ఫాలో అయ్యాడు. నిజానికి ఈ సోడియం బ్రోమైడ్ కూడా టేబుల్ సాల్ట్‌లాగానే ఉంటుంది. కానీ ఇది చాలా విభిన్నమైన సమ్మేళనం. దీన్ని మందుల్లో ఉపయోగిస్తారు. సాధారణంగా పారిశ్రామిక శుభ్రపరిచే ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. అలాంటి ఈ సమ్మేళనాన్ని అధికంగా తీసుకుంటే దుష్ప్రభావాలు ఎదుర్కొనక తప్పవని వెల్లడించారు వైద్యులు.
ఇక ఆ వ్యక్తి ఆ కారణంగానే జస్ట్ 24 గంటల్లోనే ఆస్పత్రి పాలయ్యాడని చెప్పారు వైద్యులు. అంతేగాదు మానసికంగా శారీరకంగా అనారోగ్యం పాలయ్యాడు. ఆ వ్యక్తికి ఎలక్ట్రోలైట్లు, యాంటీసైకోటిక్స్‌తో చికిత్స అందిచడం, సైక్రియాట్రీక్ పర్యవేక్షణ తదితరాలతో మెరుగయ్యేలా చేశారు.
దాదాపు మూడు వారాల పాటు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. అతను కాలేజ్‌లో న్యూట్రిషన్ ఫుడ్‌పై అధ్యయనం చేస్తున్నాడని అందులో భాగంగానే తనపై ఇలా ప్రయోగం చేసుకున్నట్లు సమాచారం. ఇక్కడ చాట్‌జీపీటీ వంటివి సమాచారం ఎల్లప్పుడూ కచ్చితమైనది కాదని కేవలం అవగాహన కల్పించగలదని చెబుతున్నారు నిపుణులు. అది ఇచ్చే సమాచారం నమ్మి స్వీయ చికిత్సలు తీసుకోరాదని, వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించి కికిత్స తీసుకోవడం మంచిదని పేర్కొన్నారు. ఇక ఔషధంగా ఉపయోగించే సోడియం బ్రోమైడ్ వల్ల కలిగే ప్రమాదాలు ఏంటంటే..
అధిక మోతాదులో తీసుకుంటే నరాల వ్యవస్థపై ప్రభావం చూపి..తలనొప్పి, మానసిక ఆందోళన, మత్తు వంటి లక్షణాలు ఉత్పన్నమవుతాయి
చర్మంపై అలెర్జీ, వాపు వంటి సమస్యలు
వాంతులు, మలబద్ధకం, ఆకలి లేకపోవడం
మూర్ఛ, కోమా, శ్వాస సంబంధిత సమస్యలు, ప్రాణపాయం వంటివి సంభవిస్తాయి.
అందువల్ల దీన్ని ఉప్పుగా వాడటం అనేది అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు. దీన్ని వైద్యుల పర్యవేక్షణలోనే ఔషధంగా ఉపయోగించాలని హెచ్చరిస్తున్నారు.
(చదవండి: హార్ట్ అటాక్ ముప్పు మహిళల్లోనే ఎక్కువ..! ఎందుకంటే..)