
గుండె పోటు (హార్ట్ అటాక్) గురించి ఆలోచన రాగానే... మనకు కనిపించే దృశ్యం... మధ్య వయస్కుడైన పురుషుడు అలా తన ఛాతి పట్టుకుని ఒరిగి΄ోతున్నట్లుగామన కళ్ల ముందుకు వస్తుంది. కానీ అసలైన చేదు నిజం ఏమిటంటే... భారతదేశంలో గుండెజబ్బులు పురుషులతోపాటు మహిళల ప్రాణాలను కూడా ఎక్కువగానే తీసుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే... బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, ప్రెగ్నెన్సీ సంబంధిత మరణాల కంటే గుండె జబ్బులే మహిళల ప్రాణాలను ఎక్కువగా హరిస్తున్నాయి. ఇది కేవలం ప్రాణాలను తీసుకోవడానికే పరిమితం కావడం లేదు...వాళ్లల్లో వచ్చే గుండెజబ్బులను సరిగా అర్థం చేసుకోలేకపోవడం, సరిగా నిర్ధారణ చేయలేకపోవడం, తగిన చికిత్స అందించలేకపోవడానికీ దారితీస్తోంది. ఈ నేపథ్యంలో మహిళల్లో వచ్చే గుండెజబ్బులు సాధారణం కంటే ఏ రకంగా భిన్నంగా ఉంటున్నాయో తెలుసుకునేందుకే ఈ కథనం.
భారతీయ మహిళల్లో దురదృష్టకరమైన అంశమేమిటంటే... పాశ్చాత్య మహిళలతో పోలిస్తే వీళ్లలో గుండెజబ్బులు దాదాపు పదేళ్లు ముందుగానే వస్తున్నాయి. ఇటీవల వయసు పరంగా తమ ముప్ఫైలలో, లేదా నలభైలలో ఉన్న మహిళలు గుండెపోటుతో ఆసుపత్రికి రావడం మునపటి కంటే చాలా ఎక్కువైంది. ఒక అధ్యయనం ప్రకారం, భారతదేశంలో గుండె΄ోటుకు గురయ్యే వారిలో చాలా తక్కువ వయసున్న వాళ్లే! వీళ్లలోనూ 40 ఏళ్ల వయసు కంటే తక్కువగా ఉండేవారు 25 శాతం వరకు ఉంటారు. వీళ్లలోనూ మహిళల సంఖ్య గణనీయంగానే ఉంది.
పాశ్చాత్య దేశాల్లో మెనోపాజ్ వరకు హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ రక్షణగా పనిచేస్తుంది. కానీ భారతీయ మహిళలకు జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి సమస్యలు, సమాజంలోని నిర్లక్ష్యం కలగలిపి ఇది ముందే రావడానికి కారణమవుతున్నాయి. అయితే... ఇది కేవలం ఐస్‌బర్గ్‌కి తాలూకు పైకి కనిపిస్తున్న టిప్ మాత్రమే. అసలు మూలాలు ఇంతకంటే చాలా లోతుగా ఉంటాయి.
పురుషుల గుండెపోటు లక్షణాలు సాధారణంగా ఛాతీలో ఎడమవైపున తీవ్రమైన నొప్పితో కుదేలై΄ోయేలా చేస్తుంది. ఆ నొప్పితో ఎడమ చేతికి పాకుతూ ఉండటం వంటివి చాలా మామూలుగా కనిపించే లక్షణమైతే మహిళల్లో మాత్రం కాస్త భిన్నంగా కనిపించవచ్చు.
ఆ లక్షణాలివి...
అస్థిమితంగా, ఇబ్బందిగా ఉండటం (అనీజీనెస్)
ఛాతీ నొక్కుకు పోయినట్లుగా/ఛాతీలో ఇబ్బందిగా ఉండటం దవడ, భుజాలు, కొన్నిసార్లు వీపులో నొప్పి
తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, అలసట
ఊపిరి అందకపోవడం, ఆయాసం వికారం, వాంతులు
చెమటలు పట్టడం
చాలామంది మహిళలు ఈ లక్షణాలను తమ తీవ్రమైన ఒత్తిడికీ, గ్యాస్ సమస్యకూ, ఇంట్లోని పనుల ఒత్తిడికీ ముడిపెడుతుంటారు. కుటుంబ సభ్యులూ ఇదే అనుకుంటారు. చివరికి చాలామంది డాక్టర్లు కూడా ఇలాగే అపోహపడుతుండటం మామూలే. ఇవన్నీ దాటి వారు హాస్పిటల్‌లోకి వచ్చేనాటికి... విలువైన పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది.
మహిళల్లోఈ ముప్పుఎందుకంటే?
ఈ విషయం తెలుసుకోవాలంటే... జీవశాస్త్రపరంగా లేదా విజ్ఞానశాస్త్రపరంగా కేవలం వాళ్ల శరీర నిర్మాణానికే పరిమితమైతే సరిపోదు. ఇంకా లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. భారతీయ మహిళకు కనిపించని సవాళ్లెన్నో ఉంటాయి. ఉదహరణకు బయటకు కనిపించకుండానే వాళ్లల్లో పొట్టచుట్టు కొవ్వు పెరగడాన్ని (మరీ ముఖ్యంగా ప్రసవాల తర్వాత) అది సహజం అనుకుంటారు తప్ప పెద్దగా ఎవరూ సీరియస్‌గా తీసుకోరు.
వాళ్లుకూడా తమ రోజువారీ పనుల్లో పడిపోవడం, ఇంటి పని, పిల్లల సంరక్షణల తర్వాతే తమ సొంత ఆరోగ్యం అంటూ తమను తాము మోసగించునే తప్పుడు అపోహల్లో ఉండిపోవడం వంటివి ఓ ఒత్తి వెలిగించిన బాంబు చివరన మహిళలు ఉండటమంతటి తీవ్రమైన ముప్పునకు గురిచేస్తున్నాయి. ఎట్టకేలకు వాళ్లు ఇలా తమ ఇంటిపనుల సంస్కృతిలో మునిగిపోయి మౌనంగా ఉండిపోతున్నారు.
వీటిల్లో పడి తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, పురుషులతో పోలిస్తే... అప్పుడప్పుడైనా చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలకు మహిళలు దూరంగా ఉండటం, కనీసం దగ్గర్లో ఉండే క్లినిక్‌కూ వెళ్లకపోవడం వంటి అంశాలు వారిని ఆరోగ్యానికి దూరం చేస్తూ, గుండెజబ్బులకు దగ్గర చేస్తున్నాయి.
ఆ సూచనలు వాళ్ల గర్భధారణసమస్యలకే కాదు...
గుండె తాలూకు ముప్పునకూ చిహ్నాలు... కొన్ని సూచనలను మహిళల తాలూకు జెండర్‌కూ, వాళ్లకు మాత్రమే సంబంధించిన గర్భధారణ వంటి అంశాల తాలూకు సమస్యలు అనుకుంటారు తప్ప అవి గుండెకూ వర్తిస్తాయని అనుకోరు. ఉదాహరణకు... గర్భవతిగా ఉన్నప్పుడు పెరిగే రక్త΄ోటు (ప్రీ–ఎక్లాంప్సియా), గర్భిణిగా ఉన్నప్పుడు కనిపించే డయాబెటిస్ (జెస్టేషనల్ డయాబెటిస్), నెలలు నిండకముందే ప్రసవం కావడం (ప్రీ–టర్మ్ డెలివరీ) అనేవి గర్భవతికి వచ్చే ముప్పులుగా పరిగణిస్తారు.
కానీ చాలామంది మహిళలు తమ ప్రసవం తర్వాత... అన్ని సూచనలనూ హాయిగా మరచి΄ోతారు. కానీ... నిజానికి అవి మున్ముందు రాబోయే గుండెజబ్బులకు సూచనలుగా చూడాల్సిన అంశాలు. అయితే ఇక్కడ కూడా మహిళలు తమ చేతులు కాలాకే ఆకుల కోసం చూస్తారు. అంటే నివారణకు అవకాశమున్నప్పుడే జాగ్రత్త పడకుండా దాన్ని చికిత్స వరకూ తీసుకొస్తారు.
మరింత అప్రమత్తంగాఉండాలని సూచించే ఆసక్తికరమైన ప్రత్యేకాంశాలు ఏమిటంటే...
తొలిసారి గుండెపోటు తర్వాత ఏడాదిలోపు చని΄ోయే కేసుల్లో పురుషుల కంటే మహిళల సంఖ్య దాదాపు రెట్టింపు.
టకోట్సుబో కార్డియోమయోపతి (దీన్నే వాడుక భాషలో బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్) అనేది మహిళల్లోనే ఎక్కువ. ఇది అచ్చం గుండెపోటు లక్షణాలను కనబరుస్తుంది. అయితే దీని చికిత్స మాత్రం కాస్త వేరుగా ఉంటుంది. తప్పుడు లక్షణాలతో వ్యక్తం కావడంతో వారికి అందాల్సిన చికిత్స సరిగా అందకపోవడం.
ఇక ఇటీవల కోవిడ్ (కరోనా వైరస్) దెబ్బ, లాక్‌డౌన్ తర్వాత మన భారతీయ మహిళల్లో గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగినట్లు అధ్యయన ఫలితాల డేటా వెల్లడిస్తోంది. వాళ్లలో పెరుగుతున్న ఒత్తిడీ, బరువు పెరగడం, తరచూ చెకప్స్‌కు వెళ్లక΄ోవడం వంటి అంశాలు ఈ ముప్పును మరింతగా పెంచేస్తున్నాయి.
మరి ఇప్పుడు జరగాల్సింది ఏమిటి..?
జరగాల్సిందేమిటంటే... ముందుగా మహిళల్లో అవగాహన పెరగాలి. గుండెజబ్బులూ లేదా గుండె΄ోటు అనేది కేవలం పురుషుల సమస్య మాత్రమే కాదు... అది మహిళల్లోనూ వచ్చే అవకాశం అంతే ఉందనీ, కొన్నిసార్లు వాళ్లకంటే ఎక్కువేనన్న అవగాహనను మహిళలు పెంచుకోవాలి.
తమ సమస్యలైన రక్తపోటు, డయాబెటిస్, రక్తంలో కొవ్వులు (కొలెస్ట్రాల్) వంటి స్క్రీనింగ్ పరీక్షలు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. అంతేకాదు... ఏదో మధ్యవయసుకు వచ్చాక మొదలుపెట్టడం కంటే ఈ పరీక్షలను ముందునుంచే చేయించుకుంటూ ఉండటం మేలు.
గర్భధారణ, ప్రసవం సమయాల్లో కనిపించే లక్షణాలను ఆ తర్వాత విస్మరించకూడదు. మున్ముందు రాబోయే గుండె తాలూకు ముప్పులకు సూచికగా పరిగణించి, వాటి గురించి మీ డాక్టర్‌తో చర్చించాలి.
ఈ ముప్పుల గురించి డాక్టర్లకు కూడా.. మరీ ముఖ్యంగా ఎమర్జెన్సీలో ఉండే డాక్టర్లూ, గ్రామీణ ప్రాంతల్లో సేవలందించే ప్రైమరీ కేర్ డాక్టర్లకు కూడా వీటి పట్ల అవగాహన పెంచాలి.
మహిళల స్వావలంబన, అవగాహన అనేది వైద్యవిజ్ఞానం, వైద్యచికిత్సల విషయంలోనూ పెరగాలి. తమకు కనిపిస్తున్న లక్షణాల గురించి, తమ ఆరోగ్య ప్రాధాన్యం గురించి వాళ్లు ఇంటిపనులను పక్కనబెట్టి నిర్మొహమాటంగా మాట్లాడుతుండాలి.
నిజానికి మహిళలకు అందే చికిత్స సరైనదేనా?
వాస్తవానికి కాదనే జవాబే చాలాసార్లు వస్తుందీ ప్రశ్నకు! గుండెజబ్బు ఉండి హాస్పిటల్‌కు వచ్చే వాళ్లలో చాలా తక్కువ మందికి మాత్రమే థ్రాంబోలైసిస్‌కూ, యాంజియోప్లాస్టీ వంటికి చికిత్సలకూ... అంతెందుకు గుండెపోటుగా అనుమానించినప్పుడు ఇచ్చే చాలా బేసిక్ మందు ఆస్పిరిన్ టాబ్లెట్ కూడా వాళ్లకు అందడం కష్టమే. వాళ్ల లక్షణాలను పెద్దగా పరిగణనలోకి తీసుకోరు. వాళ్ల ఈసీజీని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇవన్నీ కలగలిసి వాళ్ల ముప్పు అనూహ్యంగా పెరుగుతుంది.
ఈ ముప్పును మరింతగా పెంచే మరో అంశమేమిటంటే... ఇటీవల మనం వాడుతున్న మార్గదర్శకాలన్నీ పాశ్చాత్య దేశాలనుంచి తీసుకున్నవే. అవి మన దేశీయ మహిళల శరీర నిర్మాణాన్ని బట్టి పాశ్చాత్యులతో పోలిస్తే మన మహిళల్లో రక్తనాళాలు ఒకింత సన్నగా ఉండటం, ఇక్కడ డయాబెటిస్ కేసులు ఎక్కువగా ఉండటం, పాశ్చాత్యులతో పోలిస్తే మన భారతీయ మహిళల దేహాల్లో కొవ్వు పేరుకుపోయే చోట్లు వేరుగా ఉండటం వంటి మన తాలూకు ప్రత్యేక అంశాలను పరిగణనలోకి తీసుకోక΄ోవడం వంటివి మహిళల్లో గుండెజబ్బుల ముప్పును మరింత పెంచుతున్నాయి.
‘ఇంటికి మూలం ఇల్లాలే’... ‘ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది’... ‘ఇల్లాల్ని చూసి ఇంటిని చూడమన్నారు... ‘ఇంటికి ఇల్లాలే గుండెకాయ’... లాంటి భావోద్వేగపరమైన సూక్తులను మనం చాలా ఎక్కువే చెప్పుకుంటూ ఉంటాం. కానీ నిజంగా వైద్యచికిత్స విషయానికి వచ్చేప్పటికీ వాటిని తెలియకుండానే విస్మరిస్తుంటాం. మహిళకు వచ్చే గుండెజబ్బు అనేది కేవలం ఆమె ఒంటికి మాత్రమే పరిమితం కాదు.. అది సామాజికంగా, సాంస్కృతికంగా కూడా మనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే పురుషుల గుండెజబ్బులతో సమానంగా... మరీ చె΄్పాలంటే అంతకంటే ముఖ్యంగా పరిగణిస్తే కుటుంబ హృదయస్పందనలు సజావుగా జరుగుతాయని గుర్తుపెట్టుకోవాలి.
ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్
(చదవండి: