సీతాకోకచిలుకలా... ప్రయోజనాలను ఇచ్చే బద్ధకోణాసనం! | What Is Butterfly Yoga Pose: Know About Baddha Konasana Health Benefits, Step-by-Step Method And Important Precautions | Sakshi
Sakshi News home page

సీతాకోకచిలుకలా... ప్రయోజనాలను ఇచ్చే బద్ధకోణాసనం!

Jul 4 2026 9:33 AM | Updated on Jul 4 2026 10:13 AM

Baddha Konasana The Pose Benefits Health Suggestions

యోగా

బద్ధకోణాసనం

డెస్క్‌ ఉద్యోగాల్లో ఒత్తిడిని తగ్గించి, శరీరానికి మంచి ప్రయోజనాలను అందించడంలో అధిక ప్రయోజనాలను ఇచ్చే యోగాసనాల్లో బద్ధకోణాసనం ఒకటి. ఈ యోగా భంగిమలో సీతాకోక చిలుక రెక్కల్లా మోకాళ్లు కదలికలు ఉంటాయి కాబట్టి దీనిని ఈ పేరుతో పిలుస్తారు. కాళ్లు, తుంటి, వెన్ను భాగాలకు ఇది ఎంతో మేలు చేస్తుంది.

ఉదయం లేదా సాయంత్రం రోజూ కొన్ని నిమిషాలు ఈ బటర్‌ఫ్లై ఆసనాన్ని సాధన చేస్తే మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు. కంప్యూటర్లలో పని చేసే వారు, వెన్ను నొప్పి, మెడ, తుంటి నొప్పితో ఇబ్బంది పడేవారికి ఇది ఎంతో ఉపయోగకరం.

చేసే విధానం (20 నుంచి 30 సార్లు)

  • నేలపై యోగా మ్యాట్‌పై కూర్చోవాలి.

  • రెండు పాదాలను ఒకదానికొకటి తాకించి, చేతులతో పాదాలను పట్టుకోవాలి.

  • వెన్నెముకను నిటారుగా ఉంచాలి.

  • శ్వాసను గమనిస్తూ మోకాళ్లను సీతాకోకచిలుక రెక్కల్లా మెల్లగా పైకి–కిందికి మెల్లగా కదిలించాలి ∙సాధారణ శ్వాసతో 20 నుంచి 30 సార్లు చేయాలి.

ప్రయోజనాలు...

  • పెల్విక్‌ప్రాంతంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

  • వెన్ను నొప్పి, నడుము బిగుతు తగ్గించడంలో సహాయపడుతుంది.

  • ఎక్కువసేపు కూర్చునే వారికి ఉపశమనం కలిగిస్తుంది.

  • మహిళల్లో పెల్విక్‌ ఆరోగ్యానికి, గర్భధారణ సమయంలో (నిపుణుల పర్యవేక్షణలో) ఉపయోగకరంగా ఉంటుంది.

  • శరీర ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.

  • లోయర్‌ బ్యాక్‌ కండరాలకు బలం చేకూరుతుంది.

  • ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

  • వెన్ను, మెడ, తుంటి నొప్పులు తగ్గడంలో సహాయపడుతుంది.

జాగ్రత్తలు...

  • మోకాలి లేదా హిప్‌కు తీవ్రమైన గాయం ఉంటే చేయకూడదు. ∙మోకాళ్లను బలవంతంగా నేలకు నొక్కకూడదు. ∙వెన్ను వంచకుండా నిటారుగా ఉంచాలి.

  • నొప్పి అనిపిస్తే వెంటనే ఆపాలి.

  • గర్భిణులు తప్పనిసరిగా శిక్షణ పొందిన యోగా గురువు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.

-అనిత పాతర్ల, యోగా ట్రైనర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement