
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. డిజిటల్ విప్లవాన్ని నడిపించే నాయకుడిని కలిగి ఉండటం భారతదేశ అదృష్టమంటూ కొనియాడారు.
బుధవారం న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2025)కు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ, భారతి గ్రూప్ సునీల్ భారతి మిట్టల్ ఇతర కార్పొరేట్ పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆకాష్ అంబానీ పీఎం మోదీ నాయకత్వాన్ని, దార్శనికతను ప్రశంసించారు, మోదీ లాంటి నాయకుడిని కలిగి ఉండటం ఇండియా అదృష్టమన్నారు, మోదీ విజన్ గత పాతికేళ్లుగా దేశ సాంకేతిక , ఆర్థిక ప్రయాణాన్ని నిర్దేశించిందనీ, భారతదేశ డిజిటల్ విప్లవంలో ఆయన పాత్ర కీలకమైనదని అభివర్ణించారు.
#WATCH | Delhi: On PM Modi's 25 years of serving as head of a government, Chairman of Reliance Jio Infocomm Limited, Akash Ambani says, "It has been an absolutely revolutionary mode for India and we are lucky to have a leader like him." pic.twitter.com/R8i5gdwddx
— ANI (@ANI) October 8, 2025
అలాగే స్టార్టప్‌లు, విద్యావేత్తలు మరియు పరిశ్రమ నాయకుల సంయుక్త ప్రయత్నాల ద్వారా ప్రపంచ ఆవిష్కరణ కేంద్రంగా మారే దిశగా దేశం పురోగతిని ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రదర్శిస్తుందని అంబానీ అన్నారు. చిప్ తయారీ నుండి ఫ్రాడ్ మేనేజ్ మెంట్ సిస్టం, తదుపరి తరం వైర్‌లెస్ కనెక్టివిటీ వరకు, తాము పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని గమనించామని పేర్కొన్నారు. ఇది భారతదేశ సాంకేతిక పర్యావరణ వ్యవస్థకుగర్వకారణమైన క్షణం, దేశం ప్రపంచ డిజిటల్ విప్లవంలో ముందంజలో ఉండ బోతోందన్నారు.

ఇదీ చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు
సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) డైరెక్టర్ జనరల్ SP కొచ్చర్ మాట్లాడుతూ, ఐఎంసీ భారతదేశం అధునాతన కనెక్టివిటీ, డిజిటల్ ప్రయాణంలో ఒక కొత్త దశ అన్నారు. దేశీయ సాంకేతిక పురోగతి సమర్థుల చేతుల్లో ఉందనీ మెరుగైన కనెక్టివిటీ మారుమూల ప్రాంతాలకు చేరుకోవడం ,భద్రత, ఆవిష్కరణ, సహకారంపై నిరంతర దృష్టి కారణంగా దేశం చాలా వేగంగా గ్లోబల్ డిజిటల్-ఫస్ట్ ఎకానమీగా అవతరించనుందన్నారు.
చదవండి: నడుం నొప్పి తట్టుకోలేక, ఎనిమిది కప్పల్ని మింగేసింది... కట్ చేస్తే