ఏఐ ఫీచర్‌... ఆస్క్‌ డోర్‌ డాష్‌! | AI New Feature Ask Door Dash Technology | Sakshi
Sakshi News home page

ఏఐ ఫీచర్‌... ఆస్క్‌ డోర్‌ డాష్‌!

Jun 26 2026 9:30 AM | Updated on Jun 26 2026 9:30 AM

AI New Feature Ask Door Dash Technology

న్యూ పీచర్‌..

సంవత్సరాలుగా ఫుడ్‌ డెలివరీ యాప్‌లు ఒకేరకంగా ఉంటున్నాయి. యాప్‌ను ఓపెన్‌ చేసి, రకరకాల రెస్టారెంట్‌లను బ్రౌజ్‌ చేసి, మెనూలను పోల్చి, సిఫారసులను స్క్రోల్‌ చేసి, చివరికి ఒక ఆప్షన్‌ను ఖరారు చేసుకుంటారు. ఈ మోడల్‌కు మంచి స్పందన వచ్చినప్పటికీ చిన్న చిన్న నిర్ణయాలను కూడా సుదీర్ఘమైన ప్రక్రియగా మారుస్తుంది.

ఈ నేపథ్యంలో క్విక్‌ రికమెండేషన్‌ కోసం వచ్చింది ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డరింగ్, ఫుడ్‌ డెలివరీ కంపెనీ డోర్‌ డాష్‌. ఇంక్‌ వారి సరికొత్త ఏఐ ఫీచర్‌... ఆస్క్‌ డోర్‌ డాష్‌ రెస్టారెంట్‌ జాబితాలు, మెనూలు, ఫిల్టర్‌లను స్క్రోల్‌ చేయడానికి బదులుగా, తాము ఏమి కోరుకుంటున్నారో కస్టమర్‌లు చాట్‌బాట్‌కు సరళమైన భాషలో చెప్పవచ్చు.

యాప్‌లో ఆర్డర్‌ చేయడాన్ని నావిగేట్‌ చేయడంలా కాకుండా, సహజమైన సంభాషణలా అనిపించేలా రూపొందించబడింది. ఫుడ్‌ ఆర్డర్‌ చేయడం, కిరాణా సామాను కొనడం, రెస్టారెంట్‌లో టేబుల్‌ బుక్‌ చేసుకోవడం లాంటి పనికైనా మన అభ్యర్థనను ఏఐ అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఆప్షన్‌ చూపిస్తుంది. చిత్రాలను అప్‌లోడ్‌ చేయడానికి అనుమతిస్తుంది. తద్వారా చిత్రాల ద్వారా కూడా మన అభ్యర్థనను అర్థం చేసుకోగలుగుతుంది. కస్టమర్‌లు వేగంగా నిర్ణయం తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

ఒక నిర్దిష్ట రెస్టారెంట్‌ కోసం వెదకడం, వందలాది ఆప్షన్‌లను స్క్రోల్‌ చేయడం వంటివి చేయకుండా, కస్టమర్‌లు తాము ఏమి కోరుకుంటున్నారో సులభంగా వివరించి, వారి ప్రాధాన్యతను ఆధారంగా సలహాలు తీసుకోవచ్చు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement