
సోషల్ మీడియా యాప్స్ అంటే ఒకప్పుడు ఎంటర్‌టైన్మెంట్.. వ్యక్తిగత అనుభూతి, అభిరుచులు ఉత్సాహంగా పంచుకోవడం.. కానీ ప్రస్తుతం హేట్ స్పీచ్, విద్వేషాలు, నెగెటివ్ కామెంట్స్, బాడీ షేమింగ్ వంటి అంశాలకు ఆన్‌లైన్ వేదికలుగా మారాయి. ముఖ్యంగా అమ్మాయిలకు, మహిళలకు ఫేస్‌బుక్, ఇన్‌స్టా వంటి వేదికలు మరింత అసభ్యకరంగా మారాయి. జెన్ జీ బ్యాచ్ అయితే మరీ హద్దు అదుపు లేకుండా ట్రోలింగ్, లీచింగ్‌కు పాల్పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మహిళలు, యూత్ గర్ల్స్‌కు ప్రత్యామ్నాయ ఆన్‌లైన్ వేదికల అవసరముందని ఆలోచించారు నగరానికి చెందిన మహిళా అడ్వొకేట్ వెన్నెల. ఇందులో భాగంగానే కేవలం మహిళల కోసమే అనే సోషల్ యాప్ రూపొందించారు.
ఇన్నోవేషన్ల వేదికగా..
ఈ ‘షీ అస్త్ర’ యాప్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా రూమ్స్ ఉంటాయి. టాలెంట్ రూమ్‌లో యువత ఆర్ట్స్, స్కిల్స్ ప్రోత్సహించేలా రూపొందించారు. ముఖ్యంగా జెన్ జీ అట్రాక్షన్, గుర్తింపునకు వారిలోని నైపుణ్యాన్ని, కళలను షేర్ చేసుకోవచ్చు. అమ్మాయిలు స్వేచ్ఛగా మాట్లాడుకోడానికి, చర్చించుకోడానికి గాసిప్ రూమ్, ఈ తరం ఇన్నోవేషన్స్, స్టార్టప్స్, బ్రాండ్స్ ప్రమోట్ చేసుకోడానికి రికమండేషన్ రూమ్ వంటివి ఉన్నాయి.
డిప్రెషన్, ట్రోమా వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రైవసీతో సిస్టర్ ఎస్‌ఓఎస్ వేదిక ఉంది. మహిళలకు ప్రోత్సాహం, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ‘షీ అస్త్ర స్కూల్’ తయారు చేశారు. ఇది మహిళలకు పెద్దబాలశిక్ష మాదిరి అని వెన్నెల తెలిపారు. మిగతా సోషల్ యాప్స్‌లో ట్రోలింగ్ రిపోర్ట్ చేయడానికి ట్రోల్ పోలీస్, సెకండరీ విక్టిమైజేషన్, హాష్‌ట్యాగ్ వంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉండటం విశేషం.
అడ్వొకేట్ ప్రాక్టీస్‌లో భాగంగా మహిళలకు సైబర్, ఆన్‌లైన్ వేధింపులకు సంబంధించిన పలు సున్నితమైన, సూక్ష్మమైన అంశాలను.. అవి ప్రభావితం చేసే పరిస్థితులను ప్రత్యక్షంగా చూశానని యాప్ రూపొందించిన వెన్నెల తెలిపారు. సోషల్ మీడియా ట్రోలింగ్‌తో ఎందరో అమ్మాయిలు, ఇన్‌ఫ్లుయెన్సర్స్ నిరాశ,
నిరాస నిస్ప్రుహలోకి చేరుకోవడం సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితులకు పరిష్కారంగా మిగతా సోషల్ యాప్స్‌లాగే కేవలం ఉమెన్ కోసం ‘షీ అస్త్ర’ యాప్ రూపుదిద్దుకుంది. దీనికి మహిళగా తప్పనిసరి ఆధార్ అప్రూవల్ అవసరం. దేశంలో మొదటి ఆధార్ అనుసంధానిత యాప్ కావడం దీని ప్రత్యేకత. ఈ యాప్‌ను నగరంలోని టీహబ్ వేదికగా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా ప్రముఖ సినీ దర్శకులు శేఖర్ కమ్ముల, ఐఏఎస్ ఆఫీసర్ భవానీ శ్రీ, ఐఆర్‌ఎస్ అధికారి బలరాం, ఐఏఎమ్‌సీ డిప్యూటీ రిజి్రస్టార్ నిక్షిత నిరంజన్ ఆవిష్కరించారు.
నా వంతు సహకారంగా..
సోషల్ మీడియాలో ఒక ఫొటో పెడితే ఎన్నో నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్.. మహిళలు స్వేచ్ఛగా తమ ఆలోచలనలు పంచుకోలేకపోతున్నారు. దీనిని మార్చడానికి నేనేం చేయగలను అనే ఆలోచన నుంచి నా సాంకేతిక బృందం అశ్విన్, నవ్య, దీక్ష, నవీన్ సహకారంతో దీనిని సృష్టించాం. ప్రస్తుతం దేశంలో మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. నెలకు చిన్నమొత్తం రుసుముతో దీనిని వినియోగించుకోవచ్చు. షీ అస్త్ర మహిళ కోసం మొదటి సారి భారత్ నుంచి ఆవిష్కృతమైందని గర్వంగా చెప్పుకుంటాను.
– వెన్నెల, యాప్ క్రియేటర్, అడ్వొకేట్
కామెంట్లకు గ్రూప్‌రిపోర్ట్..
ప్రస్తుత తరుణంలో అమ్మాయిలకు సురక్షితమైన వర్చువల్ స్పేస్ లేదనే చెప్పాలి. 10వ తరగతి చదువుతున్న చిన్న పిల్లలు సైతం అన్‌లైన్‌లో ట్రోల్ చేయడం, అభ్యంతరకరమైన, అశ్లీల కామెంట్లు పెట్టడం సాధారణమైపోయింది. ఈ తరుణంలో షీ అస్త్ర యాప్ మంచి ఆవిష్కరణ. అశ్లీల, అసభ్య కామెంట్లకు గ్రూప్ రిపోర్ట్ ఆప్షన్ ప్రతిఒక్కరూ వినియోగించాలి. చట్టాలు, సైబర్ క్రైమ్ ప్రభావవంతంగా ఉంటే మహిళలు తమ ఆలోచనలను మరింత ఉన్నతంగా పంచుకోగలుగుతారు.
– శేఖర్ కమ్ముల, సినీ దర్శకుడు
ట్రోలింగ్ నుంచి రక్షణగా..
మహిళలకు సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది యూనివర్స్ ప్రాబ్లం.. ఈ మధ్య ఒక అమ్మాయి విడాకులు తీసుకుని వేడుక చేసుకుంటే.. సోషల్ మీడియాలో వచి్చన నెగెటీవ్ కామెంట్స్ ఆశ్చర్యాన్ని కలిగించింది.. నాగాలాండ్‌లో ఐఏఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఓ మహిళా ఉద్యోగి తన భర్త నుంచి మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతుందని తెలుసుకోడానికి చాలా సమయం పట్టింది. అనంతరం కేసులు, కౌన్సిలింగ్‌తో పరిష్కారం చూపించగలిగా. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు రిపోర్ట్ చేయడం అలవర్చుకోవాలి.
– భవానీ శ్రీ, ఐఏఎస్, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి
నెగెటివిటీకి దూరంగా..
గత ఇరవై సంవత్సరాలుగా సోషల్ మీడియా వాడకం ఎక్కువగా పెరగడం.. దీంతో పాటు మహిళలపై ట్రోలింగ్ పెరిగింది. ముఖ్యంగా మార్ఫింగ్, ఫేక్ అకౌంట్స్ వంటివి సమస్యగా మారాయి. సాంకేతిక పరంగా మహిళలకు సురక్షితమైన షీ అస్త్ర వంటి ఆన్‌లైన్ వేదికలు పెరగాలి. ఇది అనువైన డిజైనింగ్ క్రియేటింగ్ స్పేస్ కావలి.. ట్రోలింగ్, నెగెటివిటీకి దూరంగా.. షీ అస్త్రలోని ప్రైవసీ పాలసీ, మలి్టపుల్ ఫీచర్స్, రిపోర్టింగ్ ఆప్షన్స్ అమ్మాయిలకు మేలు చేస్తాయి.
– నిక్షిత నిరంజన్, ఐఏఎమ్‌సీ డిప్యూటీ రిజి్రస్టార్.
రెండు అంశాల సమ్మిళితం..
సామాజికంగానే కాదు ఆన్‌లైన్ వేదికగా కూడా అమ్మాయిలకు అనువైన పరిస్థితులు కనపడట్లేదు. ఈ తరంలో వచి్చన మార్పు ఇది.. దీనికి అనుగుణంగా సాంకేతికంగా, న్యాయ శాఖ పరంగా మార్పులు రావాల్సిన అవసరముంది. ఈ రెండు అంశాల సమ్మిళితమే షీ అస్త్ర యాప్. అడ్వొకేట్ సేవలందింస్తూనే ఇలాంటి సాంకేతిక పరిష్కారం అందించిన వెన్నెల టీం ప్రయత్నం అభినందనీయం.
– బలరాం, ఎస్‌సీసీఎల్ చైర్‌పర్సన్–ఎండీ