breaking news
vennala
-
రక్షణ ఛత్రం..! 'షీ అస్త్రం'..
సోషల్ మీడియా యాప్స్ అంటే ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్.. వ్యక్తిగత అనుభూతి, అభిరుచులు ఉత్సాహంగా పంచుకోవడం.. కానీ ప్రస్తుతం హేట్ స్పీచ్, విద్వేషాలు, నెగెటివ్ కామెంట్స్, బాడీ షేమింగ్ వంటి అంశాలకు ఆన్లైన్ వేదికలుగా మారాయి. ముఖ్యంగా అమ్మాయిలకు, మహిళలకు ఫేస్బుక్, ఇన్‌స్టా వంటి వేదికలు మరింత అసభ్యకరంగా మారాయి. జెన్ జీ బ్యాచ్ అయితే మరీ హద్దు అదుపు లేకుండా ట్రోలింగ్, లీచింగ్‌కు పాల్పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మహిళలు, యూత్ గర్ల్స్‌కు ప్రత్యామ్నాయ ఆన్లైన్ వేదికల అవసరముందని ఆలోచించారు నగరానికి చెందిన మహిళా అడ్వొకేట్ వెన్నెల. ఇందులో భాగంగానే కేవలం మహిళల కోసమే అనే సోషల్ యాప్ రూపొందించారు. ఇన్నోవేషన్ల వేదికగా.. ఈ ‘షీ అస్త్ర’ యాప్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా రూమ్స్ ఉంటాయి. టాలెంట్ రూమ్‌లో యువత ఆర్ట్స్, స్కిల్స్ ప్రోత్సహించేలా రూపొందించారు. ముఖ్యంగా జెన్ జీ అట్రాక్షన్, గుర్తింపునకు వారిలోని నైపుణ్యాన్ని, కళలను షేర్ చేసుకోవచ్చు. అమ్మాయిలు స్వేచ్ఛగా మాట్లాడుకోడానికి, చర్చించుకోడానికి గాసిప్ రూమ్, ఈ తరం ఇన్నోవేషన్స్, స్టార్టప్స్, బ్రాండ్స్ ప్రమోట్ చేసుకోడానికి రికమండేషన్ రూమ్ వంటివి ఉన్నాయి. డిప్రెషన్, ట్రోమా వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రైవసీతో సిస్టర్ ఎస్ఓఎస్ వేదిక ఉంది. మహిళలకు ప్రోత్సాహం, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ‘షీ అస్త్ర స్కూల్’ తయారు చేశారు. ఇది మహిళలకు పెద్దబాలశిక్ష మాదిరి అని వెన్నెల తెలిపారు. మిగతా సోషల్ యాప్స్‌లో ట్రోలింగ్ రిపోర్ట్ చేయడానికి ట్రోల్ పోలీస్, సెకండరీ విక్టిమైజేషన్, హాష్‌ట్యాగ్ వంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉండటం విశేషం. అడ్వొకేట్ ప్రాక్టీస్‌లో భాగంగా మహిళలకు సైబర్, ఆన్లైన్ వేధింపులకు సంబంధించిన పలు సున్నితమైన, సూక్ష్మమైన అంశాలను.. అవి ప్రభావితం చేసే పరిస్థితులను ప్రత్యక్షంగా చూశానని యాప్ రూపొందించిన వెన్నెల తెలిపారు. సోషల్ మీడియా ట్రోలింగ్‌తో ఎందరో అమ్మాయిలు, ఇన్ఫ్లుయెన్సర్స్ నిరాశ, నిరాస నిస్ప్రుహలోకి చేరుకోవడం సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితులకు పరిష్కారంగా మిగతా సోషల్ యాప్స్‌లాగే కేవలం ఉమెన్ కోసం ‘షీ అస్త్ర’ యాప్ రూపుదిద్దుకుంది. దీనికి మహిళగా తప్పనిసరి ఆధార్ అప్రూవల్ అవసరం. దేశంలో మొదటి ఆధార్ అనుసంధానిత యాప్ కావడం దీని ప్రత్యేకత. ఈ యాప్‌ను నగరంలోని టీహబ్ వేదికగా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా ప్రముఖ సినీ దర్శకులు శేఖర్ కమ్ముల, ఐఏఎస్ ఆఫీసర్ భవానీ శ్రీ, ఐఆర్ఎస్ అధికారి బలరాం, ఐఏఎమ్‌సీ డిప్యూటీ రిజి్రస్టార్ నిక్షిత నిరంజన్ ఆవిష్కరించారు. నా వంతు సహకారంగా..సోషల్ మీడియాలో ఒక ఫొటో పెడితే ఎన్నో నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్.. మహిళలు స్వేచ్ఛగా తమ ఆలోచలనలు పంచుకోలేకపోతున్నారు. దీనిని మార్చడానికి నేనేం చేయగలను అనే ఆలోచన నుంచి నా సాంకేతిక బృందం అశ్విన్, నవ్య, దీక్ష, నవీన్ సహకారంతో దీనిని సృష్టించాం. ప్రస్తుతం దేశంలో మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. నెలకు చిన్నమొత్తం రుసుముతో దీనిని వినియోగించుకోవచ్చు. షీ అస్త్ర మహిళ కోసం మొదటి సారి భారత్ నుంచి ఆవిష్కృతమైందని గర్వంగా చెప్పుకుంటాను. – వెన్నెల, యాప్ క్రియేటర్, అడ్వొకేట్కామెంట్లకు గ్రూప్రిపోర్ట్.. ప్రస్తుత తరుణంలో అమ్మాయిలకు సురక్షితమైన వర్చువల్ స్పేస్ లేదనే చెప్పాలి. 10వ తరగతి చదువుతున్న చిన్న పిల్లలు సైతం అన్లైన్లో ట్రోల్ చేయడం, అభ్యంతరకరమైన, అశ్లీల కామెంట్లు పెట్టడం సాధారణమైపోయింది. ఈ తరుణంలో షీ అస్త్ర యాప్ మంచి ఆవిష్కరణ. అశ్లీల, అసభ్య కామెంట్లకు గ్రూప్ రిపోర్ట్ ఆప్షన్ ప్రతిఒక్కరూ వినియోగించాలి. చట్టాలు, సైబర్ క్రైమ్ ప్రభావవంతంగా ఉంటే మహిళలు తమ ఆలోచనలను మరింత ఉన్నతంగా పంచుకోగలుగుతారు. – శేఖర్ కమ్ముల, సినీ దర్శకుడుట్రోలింగ్ నుంచి రక్షణగా.. మహిళలకు సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది యూనివర్స్ ప్రాబ్లం.. ఈ మధ్య ఒక అమ్మాయి విడాకులు తీసుకుని వేడుక చేసుకుంటే.. సోషల్ మీడియాలో వచి్చన నెగెటీవ్ కామెంట్స్ ఆశ్చర్యాన్ని కలిగించింది.. నాగాలాండ్‌లో ఐఏఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఓ మహిళా ఉద్యోగి తన భర్త నుంచి మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతుందని తెలుసుకోడానికి చాలా సమయం పట్టింది. అనంతరం కేసులు, కౌన్సిలింగ్‌తో పరిష్కారం చూపించగలిగా. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు రిపోర్ట్ చేయడం అలవర్చుకోవాలి. – భవానీ శ్రీ, ఐఏఎస్, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి నెగెటివిటీకి దూరంగా.. గత ఇరవై సంవత్సరాలుగా సోషల్ మీడియా వాడకం ఎక్కువగా పెరగడం.. దీంతో పాటు మహిళలపై ట్రోలింగ్ పెరిగింది. ముఖ్యంగా మార్ఫింగ్, ఫేక్ అకౌంట్స్ వంటివి సమస్యగా మారాయి. సాంకేతిక పరంగా మహిళలకు సురక్షితమైన షీ అస్త్ర వంటి ఆన్లైన్ వేదికలు పెరగాలి. ఇది అనువైన డిజైనింగ్ క్రియేటింగ్ స్పేస్ కావలి.. ట్రోలింగ్, నెగెటివిటీకి దూరంగా.. షీ అస్త్రలోని ప్రైవసీ పాలసీ, మలి్టపుల్ ఫీచర్స్, రిపోర్టింగ్ ఆప్షన్స్ అమ్మాయిలకు మేలు చేస్తాయి. – నిక్షిత నిరంజన్, ఐఏఎమ్‌సీ డిప్యూటీ రిజి్రస్టార్. రెండు అంశాల సమ్మిళితం.. సామాజికంగానే కాదు ఆన్లైన్ వేదికగా కూడా అమ్మాయిలకు అనువైన పరిస్థితులు కనపడట్లేదు. ఈ తరంలో వచి్చన మార్పు ఇది.. దీనికి అనుగుణంగా సాంకేతికంగా, న్యాయ శాఖ పరంగా మార్పులు రావాల్సిన అవసరముంది. ఈ రెండు అంశాల సమ్మిళితమే షీ అస్త్ర యాప్. అడ్వొకేట్ సేవలందింస్తూనే ఇలాంటి సాంకేతిక పరిష్కారం అందించిన వెన్నెల టీం ప్రయత్నం అభినందనీయం. – బలరాం, ఎస్సీసీఎల్ చైర్పర్సన్–ఎండీ -
గుడ్డు కంటే కోడే ముందు
కోడి ముందా? గుడ్డు ముందా? ప్రపంచంలో ఇప్పటివరకు సమాధానం దొరకని ప్రశ్న. చిక్కులేని సింపుల్ ప్రశ్న! సమాధానమే.. చిక్కదు! కానీ మన ఊళ్లలో ఆడపిల్లల దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉంది. గుడ్డు కంటే కోడే ముందు అంటున్నారు వాళ్లు! ‘మేము చేసే పొదుపే ఆ బంగారు గుడ్డు’ అంటున్నారు. అదెలా? ఈ ఎంపవర్మెంట్ ఇంటర్వ్యూని చదవండి. తల్లులు ఆడపిల్లలను చదివించడానికి చొరవ చూపిస్తున్నారు. గ్రామాల్లో మహిళలు పెద్ద చదువులు చదువుకోకపోయినప్పటికీ జీవితాన్ని నిర్మించుకోవడంలో చాలా తెలివిగా ఉంటున్నారు, సాధికారత కోసం భర్తతో విభేదించడం లేదు. తమకు తాముగా ఆర్థిక వెసులుబాటును సాధించుకుంటూ సాధికారత దిశగా పయనిస్తున్నారు. మహిళకు ఆర్థిక స్వావలంబన, సాధికారత అనే భావన పురుడు పోసుకుని దశాబ్దాలు దాటింది. ఈ ఫలాలు క్షేత్రస్థాయిలో వేళ్లూనుకున్నాయా? మహిళ ఆశించిన స్థాయిలో సాధికార సాధనలో పయనిస్తోందా? బొట్టు బిళ్ల కోసం భర్తను రెండు రూపాయలడుగుతూనే ఉందా! లేక ఇప్పుడామె చేతిలో నాలుగు డబ్బులు కనిపిస్తున్నాయా? ఆమె శక్తి సామర్థ్యాల మీద ఆమెకు నమ్మకం కలుగుతోందా? తనకు తానుగా ముందుకు సాగగలననే ధీమా ఆమెలో పొడచూపుతోందా? ఆత్మవిశ్వాసంతో ‘నాకు నేనే ఆధారం... నేనే ఒక శక్తి’ అనేటంతటి మనోబలం ఆమె సొంతమైందా? గ్రామస్థాయిలో పర్యటించి పరిశోధించిన వెన్నెలతో సాక్షి ముఖాముఖి. ‘‘ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ పావర్టీ రిడక్షన్ ప్రోగ్రామ్’ నా íపీహెచ్డీ. ఈ సందర్భంగా రంగారెడ్డి, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో కుగ్రామాలతో సహా చాలా విస్తృతంగా పర్యటించాను. రెండు వేల మంది మహిళలను కలిశాను. వారితో మాట్లాడుతున్నప్పుడు ‘ఫెమినైన్ జెండర్లోనే సేవింగ్స్ గుణం ఎక్కువ’ని నేను నమ్మిన సిద్ధాంతం నిజమేనని మరోసారి నిర్ధారణ అయింది. మహిళలకు స్వతహాగా పొదుపు చేసే గుణం ఉంటుంది. ప్రకృతిలో ప్రతి ప్రాణి అంతే. మహిళల జీన్స్‌లోనే ఉంటుంది. ఇంట్లో ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే... పెద్దవాళ్లు చెరో పది రూపాయలు ఇస్తే అబ్బాయిలు మొత్తం డబ్బుని తినడానికో, ఆడుకునే వస్తువులకో ఖర్చు చేస్తారు. అమ్మాయిలైతే కొందరు రెండు రూపాయలు ఖర్చు చేసి ఎనిమిది రూపాయలు పొదుపు చేస్తారు, కొందరు ఎనిమిది రూపాయలు ఖర్చు చేసి రెండు రూపాయలు పొదుపు చేస్తారు. ఈ మాత్రపు తేడా ఉంటుంది తప్ప అస్సలు పొదుపు చేయని అమ్మాయిలు కనిపించరు. ఇంత చక్కగా ప్లాన్ చేయగలిగిన ఆడవాళ్లకు ఆర్థిక సాధికారత లేకపోవడం ఏమిటి? అనిపించేది. శిఖరాన్ని చేరకమానదు! గతంలో మహిళలకు ఆర్థిక సాధికారత లేకపోవడానికి దారి తీసిన పరిస్థితులు అనేకం. అయితే మహిళ వాటి నుంచి బయటపడుతోంది. తొలి అడుగు మొదలైన రోజే మార్పు ప్రభావం ఏదని అడిగితే చెప్పడం కష్టమే. మొదలైన ప్రస్థానం శిఖరాన్ని చేరక మానదు. నేను కలిసిన వాళ్లలో ఎక్కువ మంది పెద్దగా చదువుకోని వాళ్లే. అలాంటి వాళ్లు కూడా గంట సేపు నాతో మాట్లాడితే తమకు పని గంటలు వృథా అవుతాయని ఆరాట పడేవారు. ప్రొడక్టివ్ టైమ్‌ని నిరుపయోగంగా గడపడం వాళ్లకు నచ్చడం లేదు. రెండు గంటల సేపు పత్తి కోస్తే వంద రూపాయలొస్తాయి. అలాంటి పని సీజన్లో టైమ్ వేస్ట్ కాకూడదనే ఆలోచన ఉందంటే వాళ్లకా బాధ్యత ఎవరు నేర్పారు? వాళ్లకు వాళ్లే నేర్చుకున్నారు. చేయి చాచడం లేదిప్పుడు! ‘ఒకప్పుడు ఏ చిన్న అవసరం అయినా ఒక్క పది రూపాయలకు కూడా భర్త దగ్గర చేయి చాచాల్సి వచ్చేది, మా పుట్టింటోళ్లు వచ్చారు, కోడిగుడ్డు కూర వండుతాను... అని అడిగి, భర్త పాతిక రూపాయలిస్తే గుడ్లు తెచ్చి వండేవాళ్లం. ఇప్పుడు మా దగ్గరే డబ్బులుంటు న్నాయ్. మా మీటింగుల్లో డాక్టర్లు చెప్పినట్లు ఇంట్లో కూడా గుడ్లు వండుతున్నాం. వాళ్లను డబ్బులు అడగకుండా మేము గుడ్లు తెచ్చి వండితే ఏ మొగుడికైనా అడ్డు చెప్పడానికి ఏముం టుంది’... అని ప్రశ్నించిందొ కామె. ‘డబ్బు మా దగ్గర ఉంటే బంగారు గుడ్డు చేతిలో ఉన్నట్లే’ అన్నది మరొకామె. ఇంకా... ‘మేము దాచుకున్న డబ్బు బ్యాంకులో మా పేరుతోనే ఉంటుంది. భర్తకు అవసరమైనప్పుడు మేమే ఇవ్వగలుగుతున్నాం. షావుకారు దగ్గర డబ్బు దాచుకుంటే మాకు తెలియకుండానే మా మగవాళ్లు వెళ్లి తెచ్చేసుకునేటోళ్లు. ఇప్పుడు బ్యాంకులోళ్లు అలా ఇవ్వరు కదా! మేమెళ్లి సంతకం చేస్తేనే బ్యాంకు వాళ్లు డబ్బిస్తారు. అలాంటప్పుడు ఇంట్లో మగవాళ్లు చీటికీ మాటికీ మా మీద చెయ్యి లేపగలుగుతారా?’ అన్నారు కొంతమంది. ఆ మాటల్లో వ్యక్తమైన ధీమా అక్షరాల్లో చెప్పలేనిది. వాళ్ల ముఖాలను అలా చూడాల్సిందే. ధైర్యం పెరిగింది! స్వతహాగా పొదుపు గుణం ఉన్న మహిళలకు ఇందిరా క్రాంతి పథం వంటి గవర్నమెంట్ స్కీమ్‌లు మంచి తోడ్పాటునిచ్చాయి. బ్యాంకు లావాదేవీలు నేర్చుకున్నారు. ఆడవాళ్లలో రిస్క్ చేయగలిగిన ధైర్యం కూడా కనిపించింది. పదివేల నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుబడితో చిన్న చిన్న దుకాణాలు, బ్యూటీపార్లర్, గేదెలు కొని పాల వ్యాపారం వంటివి చేయడానికి ముందుకొస్తున్నారు. సక్సెస్ అవ్వాలనే తపన, సక్సెస్ అవ్వగలమనే ఆత్మవిశ్వాసం చూశాను. ఒకవేళ పెట్టిన డబ్బు రాకపోతే మరే పనులైనా చేసుకుని ఆ లోటును పూడ్చుకోగలమనే ధీమా కూడా కనిపిస్తోంది. దాంతో ప్రతి నిర్ణయానికీ వెనుకాడడం, భర్త ఏమంటాడోననే భయం కనిపించడం లేదు. అన్నీ నీకు చెప్పాలా? ఆడవాళ్లు సంపాదించిన ప్రతి రూపాయినీ ఇంటికే ఖర్చు చేస్తుంటారు కాబట్టి భర్తలు కూడా అడ్డు చెప్పడం లేదు. మగవాళ్లు దానిని సౌకర్యంగానే భావిస్తున్నారు. ఆడవాళ్లు డబ్బు సంపాదించగలిగిన స్థితికి చేరడంతో భర్త సంపాదన గురించి కూడా తెలుసుకోగలుగుతున్నారు. వాళ్లకు భర్తను అడిగే ధైర్యం వచ్చింది. అంతకు ముందు పొలంలో పండిన ధాన్యం అమ్మితే ఎంత డబ్బు వచ్చిందనేది భార్యకు తెలిసేది కాదు. ఆమె అడిగినా ‘అవన్నీ నీకు చెప్పాలా’ అనే తిరస్కార సమాధానం వచ్చేది. ఇప్పుడు భర్తలు భార్యతో ఆర్థిక విషయాలను పంచుకుంటున్నారు. వచ్చిన డబ్బులో దేనికి ఎంత ఖర్చు చేసుకుందాం అనే చర్చ ఇళ్లలో జరుగుతోంది. ఇంటికి అవసరమైన వస్తువుల మీద ఆడవాళ్లకే ఎక్కువ ఇంట్రస్ట్ ఉంటుంది. ఆ సంతోషాలను కూడా సొంతం చేసుకోగలుగుతున్నారు. గవర్నమెంట్ స్కీమ్‌ల వల్ల గ్రామాల్లో ఉండే మహిళలు కూడా కనీసం నెలకోసారయినా పట్టణాలకు వస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులను చూస్తున్నారు. చదువుకోవడం వల్ల వచ్చే విజ్ఞానం విలువ తెలుసుకోగలుగుతున్నారు. ఈ రివల్యూషన్ తెచ్చిన గొప్ప ప్రయోజనం ఏమిటంటే... ఇప్పుడు ఆడపిల్లలను చదివించడంలో మహిళలు చొరవ చూపిస్తున్నారు. గ్రామాల్లో మహిళలు పెద్ద చదువులు చదువుకోకపోయినప్పటికీ జీవితాన్ని నిర్మించుకోవడంలో చాలా తెలివిగా ఉంటున్నారు, సాధికారత కోసం భర్తతో విభేదించడం లేదు. తమకు తాముగా ఆర్థిక వెసులుబాటును సాధించుకుంటూ సాధికారత దిశగా పయనిస్తున్నారనే చెప్పాలి. ఇక రాజకీయాధికారం విషయానికి వస్తే నేను కలిసిన వారిలో 20 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. వారిలో ఇద్దరే సొంతంగా ప్రజాప్రతినిధి కావాలనే ఉత్సాహంతో వచ్చినవాళ్లు. మిగిలిన వాళ్లంతా భర్త నిర్ణయం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లే. అయితే మొదట్లో భర్త ఇచ్చిన పేపర్ల మీద సంతకాలు చేసిన వాళ్లే... తర్వాత ‘ఇది ఇలా కాదయ్యా, మా సంఘం (డ్వాక్రా, వెలుగు, ఇందిరా క్రాంతి పథం)లో చెప్పారు’ అంటూ భర్తను కరెక్ట్ చేయగలిగిన దశకు చేరుతున్నారు. ఇప్పటి వరకు మహిళలు భర్త కళ్లతో సమాజాన్ని చూశారు, ఇప్పుడు సొంతంగా చూస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం’’. ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
డెంగీతో విద్యార్థిని మృతి
హైదరాబాద్: డెంగీ జ్వరంతో చికిత్స పొందుతూ ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన నగరంలోని ఎల్బీనగర్ బండ్లగూడలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక మల్లికార్జున్ నగర్‌కు చెందిన వెన్నెల(16) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గత వారం రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతోంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ రోజు మృతిచెందింది.