ఇస్కాన్‌ టెంపుల్‌కి రోబోటిక్‌ ఏనుగు..! నటి శ్రియా.. | Actor Shriya Saran PETA India Gift Mechanical Elephant to ISKCON Kanpur | Sakshi
Sakshi News home page

ఇస్కాన్‌ టెంపుల్‌కి రోబోటిక్‌ ఏనుగు..! నటి శ్రియా..

Jun 19 2026 5:44 PM | Updated on Jun 19 2026 5:46 PM

Actor Shriya Saran PETA India Gift Mechanical Elephant to ISKCON Kanpur

ఇస్కాన్‌ కాన్పూర్‌ జంతు సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ..జీవించి ఉన్న గజరాజులను సొంతం చేసుకోవడం లేదా అద్దెకు తీసకోకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ విషయం తెలిసి పెటా ఇండియా ఆ ఆలయానికి రోబోటిక్‌ ఆలయాన్ని బహుమతిగా ఇచ్చింది. ఉత్తప్రదేశ్‌లో ఇలాంటి ఏనుగుని పొందిన మొదటి ఆలయంగా ఇస్కాన్‌ కాన్పూర్‌ నిలిచింది. పెటా ఇండియా ఇప్పటి వరకు సమకూర్చిన రోబోటిక్‌ ఏనుగులలో ఇది 26వది. ఆలయ నిర్వాహకులు ఈ యాంత్రిక ఏనుగుకి ఘన స్వాగతం పలికారు. 

ఈ రోబోటిక్‌ ఏనుగుని కాన్పూర్‌ ఇస్కాన్‌ ఆలయానికి బహుమతిగా ఇవ్వడం కోసం నటి శ్రియా శరణ్‌, పెటాతో కలిసి పనిచేశారు. ఈ మేరకు శ్రియ మాట్లాడుతూ.."ఈ యాంత్రిక ఏనుగు వల్ల ఆలయం తన పురాతన సంప్రదాయాలను కొనసాగించవచ్చు. అదే సమయంలో గణేశుని భూలోక ప్రతినిధులైన ఏనుగులు తమ సహజ ఆవాసాలలో స్వేచ్ఛగా జీవించేలా చూడవచ్చు. అదీగాక ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇదే మొదటి యాంత్రిక ఏనుగు కావడం వల్ల ఈ కార్యక్రమం తనకెంతోక ప్రత్యేకమైనదని అన్నారు. 

కాగా, ఇస్కాన్‌ ఆలయ నిర్వాహకులు..భగవద్గీత (12.13)లో, శ్రీకృష్ణుడు నిజమైన భక్తుడు సమస్త జీవులకు దయగల మిత్రుడిగా ఉంటాడని (మైత్రః కరుణ ఏవ చ) చెప్పారు. నిజానికి దయ లేకుండా నిజమైన భక్తి ఉండదు. ఏ జీవికీ ఒత్తిడి లేదా బంధనం కలగకుండా చూసుకుంటూనే, మన ఆలయ ఊరేగింపుల ఆధ్యాత్మిక వైభవాన్ని కొనసాగించడానికి ఈ కార్యక్రమం మాకు వీలు కల్పిస్తుంది. ఈ ఆధునిక ఆవిష్కరణ  మన సంప్రదాయాల మధ్య ఒక అద్భుతమైన కలయికగా అభివర్ణించారు ఆలయ నిర్వాహకులు.

(చదవండి: తెలంగాణ అటవీశాఖకు బహుమతిగా రోబోటిక్ ఏనుగు)

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement