ఏలూరు టౌన్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా అధికార యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టిందనీ ఎస్పీ కేపీ శివకిషోర్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు డివిజన్ల పరిధిలో పోలీసుల అధికారులతో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశమున్న వ్యక్తులు, సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన పోలింగ్ కేంద్రాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించి, భద్రతా ప్రణాళికలు రూపొందించాలని ఆదే శించారు. జిల్లాలో జరిగే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తిచేసేలా బందోబస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు. సమస్మాత్మక ప్రాంతాలపై ని ఘా ఉంచాలనీ, అవాంఛనీయ సంఘటనలకు తా వులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ని యమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లను భయపెట్టడం, ప్రలోభాలకు గురిచేయటం, ఘర్షణలకు దిగటం వంటివి నిరోధించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాలన్నా రు. ఎస్‌బీ సీఐ మల్లేశ్వరరావు, డీసీఆర్‌బీ సీఐ హ బీబ్ బాషా, డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.


