కై కలూరు : వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై నమ్మకంతో అనేక మంది టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. కై కలూరు ఎన్నికల్లో కీలకమైన వెలంపేటలో మాజీ ఎంపీటీసీ సభ్యులు డోకల శ్రీనివాసరావు, అతనితో పాటు వడ్డాది రాజు, గునుపూడి శ్యామలరావు, సాధనాల చిన్ని, బోరా సూరి కై కలూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీలో చేరారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు డీఎన్నార్ వీరికి పార్టీ కండవాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు.


